స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ ఆర్  ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు రామ్ చరణ్. ఈ సినిమా తర్వాత... సోలోగా దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్ చరణ్. ఆ సినిమానే గేమ్ చేంజర్.   ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేయగా ఇద్దరు హీరోయిన్లు నటించారు. 


ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఒకరైతే... మరొకరు అంజలి. ఇక ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. అలాగే నిర్మాతగా దిల్ రాజు ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్లతో ఈ సినిమాను తీశారు. ముందుగా 450 కోట్లు అనుకున్న బడ్జెట్ 500 కోట్లు దాటిందట. మూడు సంవత్సరాల పాటు గేమ్ చేజర్ సినిమాను తీసిన సంగతి తెలిసిందే.


అయితే మొన్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో... జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేoజర్ సినిమా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. సినిమా పైన నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము లేపుతోంది. రెండో రోజు వరకు ఈ సినిమా 270 కోట్లు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం మాత్రం ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు.

మెగా కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే... 270 కోట్లు రెండు రోజుల్లోనే గేమ్ చేంజెర్ సినిమాకు వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. వాస్తవంగా గేమ్ చేoజర్ తొలి రోజు 186 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందమే అధికారిక ప్రకటన చేసింది. అయితే... ఒక్కరోజులో అన్ని కోట్లు రాలేదని సోషల్ మీడియాలో గేమ్ చేంజెస్ సినిమా పైన ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే 186 కోట్లు ఒక్కరోజులో రావడంతో రెండవ రోజు 270 కోట్లు వచ్చాయని.. ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: