తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది తమ దర్శకత్వ ప్రతిభతో అసిస్టెంట్ డైరెక్టర్ల నుండి లైట్ బాయ్ ల నుండి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు.అయితే ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడు త్రినాథరావు నక్కిన.. ఈయన ఇప్పటికే నేను లోకల్,ధమాకా,సినిమా చూపిస్త మావా వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక గతంలో వచ్చిన ధమాకా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి రవితేజని 100 కోట్ల క్లబ్లో చేర్చింది. అయితే అలాంటి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ తాజాగా సందీప్ కిషన్ తో మజాకా అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమాలో సందీప్ కిషన్ తండ్రిగా రావు రమేష్ నటించారు. 

అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేసారి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కాథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక సందీప్ కిషన్ కి జోడిగా రీతు వర్మ,రావు రమేష్ కి జోడిగా ఒకప్పటి నాగార్జున మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ నటిస్తోంది. అయితే ఈ సినిమా ఈవెంట్లో డైరెక్టర్ త్రినాధరావు నక్కిన అల్లు అర్జున్ పై సెటైర్ వేశారు.అయితే పుష్ప టు సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతారు. అయితే ఇదే విషయాన్ని పరోక్షంగా హీరోయిన్ ని వాడుకొని అల్లు అర్జున్ పై సెటైర్ వేశాడు డైరెక్టర్.

 పుష్పటు సక్సెస్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎలా అయితే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారో అచ్చం అలాగే హీరోయిన్ పేరు మర్చిపోయినట్టు నటించి అల్లు అర్జున్ పై సెటైర్ వేశాడు డైరెక్టర్ త్రినాధరావు నక్కిన. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో అల్లు ఫాన్స్ ఆ డైరెక్టర్ ని తిట్టిపోస్తున్నారు.అంతేకాదు ఈ ఈవెంట్లో హీరోయిన్ అనుష అంబానీ పై కూడా అసభ్యకర కామెంట్లు చేశారు ఈ డైరెక్టర్. ఇక ఈయన చేసిన పనులు సినిమాపై కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తాయని చాలామంది భావిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: