తాజాగా డైరెక్టర్ త్రినాధరావు నక్కిన చేసిన కొన్ని కామెంట్స్ ఎంత హాట్ గా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . సందీప్ కిషన్ హీరోగా "మజాకా" సినిమా తెరకెక్కింది . ఈ సినిమాను త్రినాథ్ రావు నక్కిన డైరెక్టర్ చేశాడు . రీసెంట్గా ఈ సినిమా ఈవెంట్లో త్రినాథ్ రావు నక్కిన మాట్లాడుతూ మన్మధుడు హీరోయిన్ అన్షూ పై చీప్ గా వల్గర్ గా డబల్ మీనింగ్ గా అసహ్యకరమైన కామెంట్స్ చేశారు. ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ గురించి పరోక్షకంగా స్పందిస్తూ.." అవి పెద్దవిగా ఉంటేనే బాగుంటాయి .. తిని బాగా పెంచమ్మా"..అంటూ చీప్ కామెంట్స్ చేశారు .
దీంతో ఒక్కసారిగా మహిళ లోకం మండిపడింది. అసలు వాడికి బుద్ధుందా..? అంటూ ఫైర్ అయిపోతుంది . అంతేకాదు ఆడవాళ్ళు కనిపిస్తే అవే చూస్తారా..? ఇక పనీపాటా లేదా..? సిగ్గు లేదా..? అంటూ ఘాటుఘాటుగా స్పందిస్తున్నారు. చాలామంది కామన్ పీపుల్స్ కూడా స్టార్ట్ డైరెక్టర్స్ కూడా ఎందుకు ఇలా నీచంగా ప్రవర్తిస్తూ మాట్లాడుతున్నారు ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . అంత పెద్ద స్టేజ్ .. అంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు . మీడియా బృందం అక్కడే ఉన్నారు. స్టేజ్ ఎక్కిన నువ్వు అంత పచ్చిగా ఎలా మాట్లాడగలిగావు నీకు బుద్ధుందా రా..? అంటూ సోషల్ మీడియాలో త్రినాథరావు నక్కిన ను ఏకిపారేస్తున్నారు..!?