విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంది. గోదారి గట్టు పాటతో ఈ చిత్రానికి చాలా బజ్ వచ్చింది.అది కొనసాగుతూనే ఉంది. సంక్రాంతి పండుగకు సూటయ్యేలా ఫ్యామిలీ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి రోజు జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. కొన్ని రోజులుగా ప్రమోషన్లను హీరో వెంకటేశ్, అనిల్‍తో పాటు మూవీ టీమ్ సభ్యులు జోరుగా చేస్తున్నారు. వరుసగా ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ట్రైలర్ కూడా ఆకట్టుకోవటంతో సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టే ఈ చిత్రానికి భారీగా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భారీ స్థాయిలో టికెట్ల బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా రిలీజ్‍కు రెండు రోజులు ఉండగానే సెన్సేషనల్ బుకింగ్స్ సాగుతున్నాయి. ఒక్క బుక్ మై షో ప్లాట్‍ఫామ్‍లోనే ఇప్పటి వరకు ఈ మూవీకి లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా బుకింగ్స్ జోరు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల థియేటర్లు అప్పుడే ఫుల్ అవుతున్నాయి. పక్కా సంక్రాంతి చిత్రంగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.విక్టరీ వెంకటేశ్‍కు ఇప్పటి వరకు తొలి రోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎఫ్3 చిత్రమే. ఈ మూవీ ఫస్ట్ డే సుమారు రూ.14కోట్లను రాబట్టింది.
అయితే, బుకింగ్స్ బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ మార్కును దాటేయడం పక్కా. వెంకీకి ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్‍గా ఉండనుంది. ఈ చిత్రం ఫస్ట్ డే రూ.20కోట్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఇదిలావుండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాను దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేశారు. వీరు నిర్మించిన గేమ్ ఛేంజర్ మూవీ కూడా సంక్రాంతి రేసులో జనవరి 10వ తేదీనే రిలీజ్ అయింది. రామ్‍చరణ్ హీరోగా నటించిన ఆ భారీ పాన్ ఇండియా పొలిటికల్ యాక్షన్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా జనవరి 12 న థియేటర్లలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలావుండగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి చేసిన ప్రమోషన్లు బాగా ఫలించాయి. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకోగా.. ప్రమోషన్లు కూడా మంచి క్రేజ్ తీసుకొచ్చింది. ఇవన్నీ కలిపి ఈ చిత్రానికి భారీగా బుకింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే ఇక భారీ కలెక్షన్లు ఖాయమే. పండుగకు ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రం చూసేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.