నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం వరుస అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య టాలీవుడ్ మాస్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రగ్యా జైస్వాల్ , బాలయ్యకు జోడిగా నటించింది. ఈ మూవీ తర్వాత నుండి బాలయ్య వరుస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ వస్తున్నాడు.

అఖండ మూవీ తర్వాత బాలయ్య "వీర సింహా రెడ్డి" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇక కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మరో విజయాన్ని కూడా బాలయ్య అందుకున్నాడు. ఇకపోతే తాజాగా బాలయ్య డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నిన్న అనగా జనవరి 12 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇకపోతే ఈ సినిమాకు కూడా మంచి టాక్ వస్తుంది.

ఇది ఇలా ఉంటే బాలయ్య తన నెక్స్ట్ మూవీ గా అఖండ 2 చేయబోతున్నాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించబోతుంది. ఇలా ఇప్పటికే బాలయ్య , ప్రగ్యా జైస్వాల్ కాంబోలో వచ్చిన అఖండ , డాకు మహారాజు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ప్రగ్యా జైస్వాల్ , బాలయ్య హీరోగా రూపొందునున్న అఖండ 2 లో కూడా హీరోయిన్గా నటించనుండడంతో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది అని బాలయ్య అభిమానులు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: