కాగా త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు . ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ శ్రీలీల నటించబోతుందట . రెండవ హీరోయిన్గా ట్రెండీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . కాగా ఇప్పుడు ఇండస్ట్రీలో బన్నికి సంబంధించిన వార్త హాట్ గా ట్రెండ్ అవుతుంది. బన్నీ నటించిన పుష్ప2 సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే అంతకంటే డబుల్ స్థాయిలోనే ఈ సినిమా కారణంగా అల్లు అర్జున్ ఇబ్బందులకు గురయ్యారు .అది వేరే విషయం .
బన్నీ పుష్ప 2 పై చాలామంది స్టార్ సెలబ్రెటీస్ రియాక్ట్ అయ్యారు. అయితే పేరు ఉన్న పెద్ద బడా స్టార్స్ మాత్రం రియాక్ట్ కాలేకపోయారు. కారణాలు ఏవైనా కావచ్చు బన్నీ పుష్ప2 పై కొందరు హీరోలు రియాక్ట్ కాకపోవడం ఫాన్స్ కి మండిపోయేలా చేసింది . అయితే అందరూ గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేశారు. బన్నీ సినిమాకు రివ్యూ ఇవ్వలేదు .. పొగడలేదు ..ఓకే మరి గేమ్ చేంజర్ సినిమాకి ఏం రివ్యూ ఇస్తారు..? ఎలా స్పందిస్తారు..? అంటూ కాచుకుని కూర్చున్నారు బన్నీ ఫాన్స్ .
అయితే ఆ స్టార్ హీరోస్ మాత్రం బాగా తెలివిగా బిహేవ్ చేశారు. ఒక్కరు అంటే ఒక్క హీరో కూడా గేమ్ చేంజర్ సినిమాపై ట్విట్ చేయడమే మానేశారు. గేమ్ చేంజర్ మిక్స్డ్ టాక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే . అయితే ఎందుకు స్టార్స్ గేమ్ చేంజర్ సినిమాపై రివ్యూ ఇవ్వలేదు అంటూ ఆలోచిస్తున్నారు . కొంతమంది ఏకంగా బన్నీకి ఆ స్టార్ లు భయపడ్డారు అని.. పుష్ప2 సినిమాకి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయని విషయం అందరికీ తెలిసిందే.. మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేయని వ్యక్తికి పక్క హీరోలు సపోర్ట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా ఇండస్ట్రీ చరిత్ర చెబుతూనే వస్తుంది . ఆ కారణంగానే భయపడి ఉంటారు అంటున్నారు. అయితే గేమ్ చేంజర్ సినిమా విషయంలో ఎక్కడ రియాక్ట్ అయితే బన్నీ హర్ట్ అవుతాడు అన్న భయం కారణంగానే స్టార్స్ ..గేమ్ చేంజర్ పై రియాక్ట్ అవ్వలేదు అని కూడా అంటున్నారు . కానీ చాలామంది మాత్రం అసలు ఆ సినిమాలో ఏముంది..? ఏం చూసి రియాక్ట్ అవ్వాలి..? అందుకే స్టార్స్ కూడా ఈ సినిమాని పరోక్షకంగా ఫ్లాప్ అంటూ ఒప్పేసుకున్నారు అంటూ ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు..!