అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరో గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం,మూవీ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది.ఈ సందర్భం గా నిన్న సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమాలో నటించిన స్టార్ కాస్ట్ అందరూ పాల్గొన్నారు.తమిళ ప్రముఖ కమెడియన్ VTV గణేష్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకలో గణేష్ మాట్లాడుతూ అనిల్ రావిపూడి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఆరు నెలల క్రితం చెన్నైలో విజయ్ని కలిశాను. అనిల్ రావిపూడి గారితో నాకు మంచి అనుబంధం ఉందని ఆయనకు తెలుసు.అనిల్ దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి చిత్రాన్ని ఐదు సార్లు చూశానని విజయ్ నాతో చెప్పారు. విజయ్ తనతో ఈ సినిమాని రీమేక్ చేయమని అనిల్ ను అడిగారట. అయితే, అనిల్ రీమేక్ చేయనని చెప్పారంటూ గణేష్ అన్నారు.ఇది చెప్పిన వెంటనే పక్కనే ఉన్న అనిల్ రావిపూడి.ఈ విషయంపై మాట్లాడవద్దని గణేశ్ని కోరారు. ఇది ఇప్పుడు చర్చించాల్సిన విషయం కాదు. రీమేక్ చేయనని నేను చెప్పలేదు. విజయ్ సార్తో మా మధ్య చర్చ వేరే విషయానికి సంబంధించిందని అనిల్ వివరణ ఇచ్చారు.విజయ్ సార్ ప్రస్తుతం ఓ చిత్రంలో పనిచేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్పై వారు అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి, ఈ సమయం లో ఇది చర్చించడం సరికాదు. విజయ్ సార్ నన్ను చాలా గౌరవంగా పిలిచారు, నేను కూడా వెళ్లి కలిసాను. కొన్ని విషయాలు చర్చించాం, కానీ అవి వేరే అంశాలకు సంబంధించినవి. విజయ్ 69 ప్రాజెక్ట్ గురించి వారు అధికారిక ప్రకటన చేసిన తర్వాత మాత్రమే దీనిపై మాట్లాడతాను. ఇప్పటి వరకు నేను కలిసిన వారిలో ఆయన చాలా మంచి వ్యక్తి,అంటూ అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: