టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా సీక్వెల్ 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం సృష్టిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1,800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. 'పుష్ప'తో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఇండియాలోనే టాప్ హీరోల లిస్టులో చేరిపోయాడు. ఇన్నాళ్లూ లవర్ బాయ్ ఇమేజ్‌తో అలరించిన బన్నీ, 'పుష్ప'లో ఊరమాస్ అవతారమెత్తి నేషనల్ వైడ్ గా క్రేజ్ పెంచుకున్నాడు.

'పుష్ప 2' సక్సెస్‌తో ఈ అల్లు హీరో రేంజ్ ఏ టాలీవుడ్ హీరో కూడా చేరుకోలేని లెవెల్ కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా, సంజయ్ లీలా డైరెక్టోరియల్ లో మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

 ఇదిలా ఉంటే మరి మీకు బన్నీ కెరీర్ మొదలైన 'గంగోత్రి' సినిమా మీకు గుర్తుందా? తొలి సినిమా నుంచే తన టాలెంట్ చూపించిన అల్లు అర్జున్ ఎన్నో విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. 'పుష్ప' సినిమాతో జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకోవడం జరిగింది. కానీ, ఆయనకు నటుడిగా మంచి మార్కులు పడేలా చేసింది మాత్రం 'గంగోత్రి' సినిమానే. రాఘవేంద్రరావు తీసిన ఇది సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో రొమాన్స్ చేసింది అదితి అగర్వాల్. ఈమె హీరోయిన్ ఆర్తి అగర్వాల్ సోదరి.

అయితే, 'గంగోత్రి' తర్వాత అదితి అగర్వాల్‌కు పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినా, అవి అంతగా ఆడలేదు. 'గంగోత్రి' తర్వాత 'కొడుకు', 'విద్యార్థి', 'లోకమే కొత్తగా', 'ఏంబాబు లడ్డుకావాలా..?' వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు గుర్తింపు రాలేదు. అంతే తట్టాబుట్టా సర్దేసుకుంది.

ఇదిలా ఉండగా, ఒకానొక సమయంలో అదితి అగర్వాల్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఓ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో తన తండ్రి, సోదరుడితో పాటు ఆమె కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియాలోనూ చిక్కదూ దొరకదు ఈ ముద్దుగుమ్మ. అయితే అదితి అగర్వాల్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇలాంటి టైమ్ లో ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇన్‌స్టాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చక్కర్లు కొడుతున్న అదితి ఫోటోలు చూసి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఆమె లుక్ టోటల్ గా గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయిపోయింది. ఆ ఫోటోలు చూసిన వారు "అదితి.. ఇది నిజంగా మీరేనా?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: