టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన అనేక మంది హీరోయిన్లు ఉన్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా మంది కాలేజీ స్టూడెంట్స్ పాత్రల్లో , ఏకంగా స్కూల్ స్టూడెంట్స్ పాత్రల్లో కూడా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత కాలేజీ వెళ్లే అమ్మాయి పాత్రలలో నటిస్తే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు కానీ , మరి స్కూల్ కి వెళ్లే అమ్మాయిల పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు పెద్దగా యాక్సెప్ట్ చేయరు. 

దానితో స్టార్ హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత స్కూల్ కి వెళ్లే అమ్మాయిల పాత్రలో దాదాపుగా కనిపించరు. కానీ వారు కెరియర్ ప్రారంభంలో స్కూలుకు వెళ్లే అమ్మాయిల పాత్రలో నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇకపోతే స్కూల్ కి వెళ్లే పాత్రల్లో మన స్టార్ హీరోయిన్స్ నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్" అనే మలయాళ సినిమాలో స్కూల్ కి వెళ్లే అమ్మాయి పాత్రలో నటించింది. ఈమె ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత కూడా ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలో స్కూలుకు వెళ్లే అమ్మాయి పాత్రలో నటించింది. ఈ సినిమాలోని సమంత నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇకపోతే కొంత కాలం క్రితం శృతి హాసన్ "3" అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఈ బ్యూటీ స్కూల్ కి వెళ్లే అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: