యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి జాన్వి కపూర్ , జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటించింది. కొరటాల శివమూవీ కి దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఈ మూవీ లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "వార్ 2" అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించడానికి కమిట్ అయ్యాడు. దానితో చాలా మంది తారక్ ఇప్పట్లో దేవర పార్ట్ 2 సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయడు , ఆ మూవీ ని స్టార్ట్ కావడానికి చాలా సమయం పడుతుంది అనే వార్తలు వచ్చాయి. దానితో తారక్ ఫ్యాన్స్ కూడా కంగారు పడ్డారు. ఇకపోతే అలా కంగారు పడ్డవారికి లేటెస్ట్ గా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవర పార్ట్ 2 షూటింగ్ ను ఈ సంవత్సరం అక్టోబర్ నెల నుండి మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ నెల నుండి ఈ సినిమా షూటింగ్ను మొదలు పెట్టి ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి చాలా త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈయన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: