ఎప్పట్లాగే బాలకృష్ణ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మాస్ డైలాగులతో తన యాక్టింగ్ తో అభిమానులను బాగా ఆకట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్ని కూడా చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాత నాగవంశీ ,డైరెక్టర్ బాబి హీరోయిన్స్ ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది ఇక్కడ నాగ వంశీ పలు రకాల వ్యాఖ్యలు మాట్లాడారు.
ముఖ్యంగా డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన తర్వాత అనంతపురంలో సక్సెస్ మీటింగుని నిర్వహిస్తామంటూ నాలు వంశీ తెలిపారు. ఇది త్వరలోనే ఉంటుంది అంటూ తెలిపారు.. అలాగే ఈ నెల 17న హిందీ, తమిళంలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నామని వెల్లడించారు. అలాగే డాకు మహారాజ్ సినిమాకి ఫ్రీక్వెల్ ఉంటుందనీ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేశారు. నాగవంశీ దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ డాకుమహారాజ్ కొనసాగింపు ఉంటుంది అంటూ తెగ వైరల్ గా చేస్తున్నారు. ఇప్పటికే డాకు మహారాజ్ గా బాలయ్య అదరగొట్టేసారని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రాబట్టిందో చిత్ర బృందం అఫీషియల్ గా వెల్లడిస్తుందేమో చూడాలి మరి.