టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం అక్కర్లేని పేరు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన తనదైన మార్క్ సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నారు. మహేష్ బాబు హీరోగా చేసిన తొలి సినిమా రాజకుమారుడు.. తాజాగా 25 సంవత్సరాల పూర్తి చేసుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా జూలై 30, 1999 రిలీజ్ అయింది. అప్పట్లో బాలీవుడ్ లో తిరుగులేని క్రేజీ హీరోయిన్గా ఉన్న ప్రీతిజింతా, మహేష్ జోడీగా నటించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చలశాని అశ్వినీద‌త్ ఈ సినిమాను నిర్మించారు.


మహేష్ బాబుని హీరోగా వెండితెరకు పరిచయం చేద్దామనుకున్న కృష్ణ.. వరుసగా కథలు వినడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పరుచూరి బ్రదర్ చెప్పిన కథ‌ ఆయనకు బాగా నచ్చింది. ఓ సాధారణ కథను సైతం తన టేకింగ్‌తో అద్భుతంగా మార్చారు దర్శకుడు రాఘవేంద్రరావు. మహేష్ తొలి సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతను కృష్ణ స్వయంగా రాఘవేంద్రరావుకు అప్పగించారు ప‌ద్మాల‌యా బ్యాన‌ర్‌పై కృష్ణ ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. అయితే మహేష్ తొలి సినిమా నిర్మించే బాధ్యతను వైజయంతి మూవీస్ కు అప్పగించారు. క‌థ‌కు కావలసిన రీచ్నస్ కోసం ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు చేసే సంస్థ వైజయంతి మూవీస్.


ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణ అశ్విని దత్‌కు తన కుమారుడని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను అప్పగించారు, ముహూర్త సన్నివేశానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాప్‌ ఇవ్వటం విశేషం. జూలై 30, 1999న.. 78 ఫ్రెంట్‌లతో 116 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదలైంది. సినిమాకు ముందు.. జస్ట్ యావరేజ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా టాక్ పెరిగి 100 రోజులు ఆడింది. ఈ సినిమాతోనే మహేష్ కు ప్రిన్స్ అనే ట్యాగ్ వచ్చింది. మహేష్ నటన, కామెడీ టైమింగ్.. ప్రీతిజింతా అందం.. మణిశర్మ సంగీతం సినిమాకు అదనపు బలాలు. 44 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫుల్ ర‌న్‌లో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను తమిళంలో కాదల్ వెన్నెల పేరుతో రీమేక్ చేశారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాగా రాజకుమారుడుకు నంది అవార్డు దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: