బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మాత్రం హిట్ కాంబోగా కొనసాగుతుండగా ఈ కాంబోలో త్వరలో తెరకెక్కనున్న అఖండ2 సినిమాపై మాత్రం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బోయపాటి శ్రీను బాలయ్యకు అఖండ2 సినిమాతో ఏ రేంజ్ హిట్ అందిస్తారో చూడాలి. బాబీ మాత్రం అటు బాలయ్యతో ఇటు జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించి సత్తా చాటడం గమనార్హం.
అయితే ఇటు ఇద్దరు హీరోలకు బాబీ మాత్రం భారీ హిట్లను అందుకున్నారు. బాలయ్య బాబీ కాంబో కూడా రాబోయే రోజుల్లో రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. బాలయ్య బాబీ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసే కాంబో అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాబీకి యంగ్ హీరోలు ఛాన్స్ ఇస్తే ఈ డైరెక్టర్ వాళ్ల నమ్మకాన్ని సైతం నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.
స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలయ్య రెమ్యునరేషన్ రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. అఖండ2 మూవీ పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ మార్కెట్ కూడా అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ సీక్వెల్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేయనుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.