డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు.ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2 ఎఫ్3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. అనిల్‌ కామెడీ టైమింగ్‌ ఉన్న దర్శకుడు. అదే బలం బలం. ఆయన సినిమాలన్నీ ఈవివి సినిమాలను గుర్తు చేస్తాయి. ఆ మార్క్‌ని ఈ ట్రెండ్‌ కి తగ్గట్టుగా అందించడంలో మంచి పనితనం కనబరుస్తున్నాడు. 'సంక్రాంతి వస్తున్నాం' కథ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. భార్య, ప్రేయసి మధ్య నలిగిపోయే భర్త క్యారెక్టర్‌ వెంకటేష్ పోషించారు.

తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ మా సినిమాలోని కంటెంట్ సంక్రాంతికి పక్కాగా సరిపోతుంది. అందుకే సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే సంక్రాంతి పండుగ రోజు విడుదల చేస్తున్నామని తెలిపారు.ఈ సినిమాలో కూడా వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించిన మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాలో నటించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇతర అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇదిలావుండగా సంక్రాంతి బరిలో నిలిచిన 3సినిమాల్లో ఇప్పటికే గేమ్ చేంజర్, డాకుమహారాజ్ రిలీజయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది. దీంతో రేపు రిలీజ్ కాబోతున్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో సినిమా కు హిట్ టాక్ వస్తే ఈ మూవీ భారీ కలెక్షన్స్ సాధిస్తుందని అంటున్నారు.
మరి సంక్రాంతి బరిలో దిగిన వెంకీ మామ ఈ సినిమాతో హిట్ కొడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: