టాలీవుడ్ నందమూరి నట‌సార్వభౌమ‌ తారక రామారావు.. ఈ పేరు చెప్తే తెలుగు నాడ పలకరించిపోతుంది. దాదాపు 300 పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తిరుగులేని ముద్ర వేసుకున్న ఆయ‌న దర్శకుడుగా, నిర్మాతగా, క‌థ రచయితగా, ఎడిటర్‌గా ఇలా ఇండస్ట్రీలో అన్ని విధాల సత్తా చాటుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమంగా కీర్తిని సంపాదించుకున్న ఆయన.. ఏకంగా 16 సినిమాల్లో శ్రీకృష్ణుడు పాత్రలో మెప్పించారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ గుర్తొచ్చే రేంజ్ లో ఆయన ముద్ర వేసుకున్నారు. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో ఎన్నో రొమాంటిక్ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది హీరోయిన్స్ తో స్టెప్పులు వేశారు.
 

ఇక సినిమాల్లో హీరో, హీరోయిన్లు గా నటించడం అంటే వావి వరసలతో సంబంధం ఉండదు. ఏ సినిమాకు ఆ సినిమా స్పెషల్ కనుక ఓ సినిమాల్లో భార్య‌గా చేసిన నటితో.. మరో సినిమాలో చెల్లిగా, ఇంకో సినిమాలో తల్లిగా నటించిన‌ సందర్భాలు చాలా ఉంటాయి. అలా సీనియర్ ఎన్టీఆర్ కూడా తన సినిమాల్లో తల్లితోనూ, తర్వాత కూతురితోను హీరోగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసిన ఇద్దరు తల్లి కూతుర్లు ఎవరో.. ఆ సినిమాలంటే ఒకసారి చూద్దాం. 1959లో సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దైవబలం సినిమాలో అన్నగారితో.. హీరోయిన్ జయ‌శ్రీ రొమాన్స్ చేసింది. ఇక ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. జయ‌ శ్రీకి కూడా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసింది.

 

త‌ర్వాత జయ‌ శ్రీ కూతురు.. జై చిత్రకూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోయిన్గా మారింది. అలా 1976లో సీనియర్ ఎన్టీఆర్.. మా దైవం సినిమాలో జై శ్రీ కూతురు.. జై చిత్రతోను రొమాన్స్ చేశారు. అయితే ఈ రెండు సినిమాల్లో కొన్ని కామన్ క్వాలిటీస్ కూడా ఉండడం విశేషం. రెండు సినిమాల టైటిల్స్ లో దైవం ఉంది. ఈ రెండు సినిమాల్లో కూడా సెప్టెంబర్ 17న రిలీజ్ అయ్యాయి. దైవ బలం సినిమా 1959 సెప్టెంబర్ 17న రిలీజ్ కాగా మా దైవం సినిమా 1976 సెప్టెంబర్ 17న వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అంతేకాదు తల్లి, కూతుర్లు ఇద్దరితో నటించిన ఏకైక హీరోగా సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఘ‌న‌త సాదించారు. తర్వాత చాలా కాలానికి మెగాస్టార్ చిరంజీవి ఆ రికార్డ్ బ్రేక్ చేశాడు. గతంలో హీరోయిన్ మేనకతో రొమాన్స్ చేసిన చిరు.. తాజాగా ఆమె కూతురు టాలీవుడ్ మ‌హాన‌టి కీర్తి సురేష్‌తోను నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: