ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రధానంగా నాలుగు పేర్లు వినిపించేవి. ఆ నాలుగు కుటుంబాల పేర్లు కూడా అందరికీ తెలిసినదే . మెగా ఫ్యామిలీ ..నందమూరి ఫ్యామిలీ ..అక్కినేని ఫ్యామిలీ ..దగ్గుబాటి ఫ్యామిలీ . వేరే ఇండస్ట్రీకి వెళ్లి తెలుగు ఇండస్ట్రీ అనే పేరు చెప్తే ముఖ్యంగా ఈ నాలుగు కుటుంబాల పేర్లే హైలెట్ గా మారేవి . అయితే అన్నిటికన్నా మాత్రం మెగాస్టార్ చిరంజీవిని ముందుగా గుర్తు చేసుకునే వాళ్ళు పక్క భాష స్టార్స్ . అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది అంటున్నారు జనాలు . దానికి కారణం మెగా హీరోస్ చూస్ చేసుకునే సినిమాలే అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. మనకి ఒక మంచి పేరు ఉంది అంటే ఆ మంచి పేరుని ఇంకా పైకి ఎదిగేలా చేసుకోవాలి కానీ ఎక్కడ తగ్గేలా చేసుకోకూడదు అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. 


మరి ముఖ్యంగా రీసెంట్గా రాంచరణ్ నటించిన 'గేమ్ చేంజఋ సినిమా నెగిటివ్ టాక్ సంపాదించుకుంది.  కొంతమంది జనాలు బాగుంది  అంటున్నారు మరి కొంతమంది మాత్రం సినిమాకి అంత సీన్ లేదు అంటూ తేల్చేస్తున్నారు. రామ్ చరణ్ నటన ఓకే బాగుంది చూడొచ్చు .. అంతేకానీ నేషనల్ అవార్డు అంత సీన్ అయితే లేదు అంటూ కూడా తేల్చేస్తున్నారు. కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై తూతూ మంత్రంగా మాట్లాడడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . మరి ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ తన మార్కు ని రీచ్ కాలేకపోయాడు అంటున్నారు జనాలు . అయితే మెగా ఫ్యామిలీ అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది చిరంజీవి.. పవన్ కళ్యాణ్ ..రామ్ చరణ్ .



ఆల్ రెడీ అల్లు అర్జున్ గ్తో విభేదాలు . అల్లు అర్జున్ ని మెగా ట్యాగ్  నుంచి తీసేశారు . అయితే మిగతా హీరోలు ఎవరు కూడా సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పేరు నిలబడతారు అని నమ్మకాలు లేవు.. వరుణ్ తేజ్ ..సాయి ధరంతేజ్ .. వైష్ణవ్ తేజ్ అందరు కూడా సెకండ్ కేటగిరి . అయితే గ్లోబల్ ఇమేజ్ దక్కించుకున్న రాంచరణ్ సైతం తన సినిమాకి నెగిటివ్ టాక్  దక్కించుకోవడంతో.. ఇప్పుడు అందరికీ కొత్త డౌట్స్ వచ్చేస్తున్నాయి.  పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ సినిమాల్లోకి రాడు . కమిట్ అయిన సినిమాలు మాత్రమే చేస్తాడు . చిరంజీవి వయసు అయిపోతుంది .. ఒకప్పటిలా మంచి మంచి సినిమాలను చేయలేడు ..మెగా పరువు నిలబెడతాడు అనుకున్నా రాంచరణ్ తొందరపాటుతో తలతిక్క కంటెంట్ సినిమాలను చూసి చూసుకుంటున్నారు. ఒకవేళ ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఇండస్ట్రీలో మెగా అన్న పేరు డమ్మీగా మారిపోతుంది అంటూ కొందరు ఘాటుగాట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: