టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంక్రాంతికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటించారు. . గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు కమర్షియల్ గా కంటే మంచి కథ బలం ఉన్న సినిమాలుగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు సొంతం చేసుకున్నాయి. . . 12 సంవత్సరాల తర్వాత మరోసారి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ రిపీట్ కావడంతో గుంటూరు కారం పై అంచనాలు మామూలుగా లేవు.
శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు స్టామినాకు తగ్గ సినిమా అయితే కాలేదు. ఇక మహేష్ బాబు తొలి సినిమా రాజకుమారుడు రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు దాటింది. వాస్తవానికి మహేష్ బాబు బాల నటుడుగా ఎన్నో సినిమాలలో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో చిన్న వయసులోనే నీడ సినిమాలో నటించారు. ఇదిలా ఉంటే .. రాజకుమారుడు సినిమా కంటే ముందే మహేష్ బాబు మరో సినిమా తో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కావాల్సి ఉంది. . .
అదే ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా వచ్చిన యమలీల. యమలీల కథను ఎస్. వి. కృష్ణారెడ్డి మహేష్ తండ్రి కృష్ణకు వినిపించారు. కృష్ణకు కథ నచ్చింది. అయితే మహేష్ చదువుకుంటున్నాడు .. రెండేళ్లు ఆగమని చెప్పారు. దీంతో అప్పటికే ఆలస్యం అవుతూ ఉండడంతో ఎస్. వి. కృష్ణారెడ్డి ఆలీ హీరోగా ఈ సినిమా తెరకెక్కించారు. యమలీల సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రెండేళ్లకు రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు వెండితెరకు పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టారు. .