టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, వెంకటేష్ లకు తెలుగు ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరుపదల వయసులోను ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్న ఈ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం హాట్‌ టాపిక్ ట్రెండ్ అవుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో ఓ మల్టీస్టారర్ ఆగిపోయిందని టాక్ నడుస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన తర్వాత లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ అయిందట. ఇంతకీ.. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య ఎంట్రీ ఇస్తే.. రామానాయుడు సినీవారసుడిగా, హీరోగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
 

అయితే గతంలోనే రామానాయుడు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కించాలని మల్టీ స్టార‌ర్‌ను ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. పరుచూరి బ్రదర్స్ వీరిద్దరి కోసం మంచి కథను కూడా రెడీ చేశారు. అయినా ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలుగా అప్పటికే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడంతో.. వీళ్ళు కాంబినేషన్లో సినిమా కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురు చూశారు. కానీ.. సినిమా వ‌ర్కౌట్‌ కాలేదు. అప్పట్లో రామనాయుడు, ఎన్టీఆర్ ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ క్రమంలోనే తమ కొడుకులు ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ తీస్తే బాగుంటుందని రామానాయుడు భావించారట. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి మాత్రం ప్రధాన కారణం సీనియర్ ఎన్టీఆర్ అంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఎందుకంటే అప్పటికే బాలయ్యకు మాస్ ఇమేజ్ వచ్చేసిందని.. వీళ్ళిద్దరి కాంబోలో రామానాయుడు తీద్దామనుకున్న సినిమా క్లాస్ మూవీ కావడంతో.. ఈ సినిమా కథ వల్ల బాలయ్యకు ఎలాంటి ఉపయోగం ఉండదు.. అసలు బాలయ్య కు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ రిత్యా స్టోరీ సెట్ కాదు అనే ఉద్దేశంతోనే సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఈ ఇద్దరు స్టార్ హీరోలు అదే క్రేజ్‌తో రాణిస్తున్నారు. దీంతో ఇక‌పై అయినా కాంబోలో మల్టీ స్టార‌ర్ వస్తే కచ్చితంగా ఆ సినిమాపై ఆడియన్స్ కు మంచి హైప్ నెల‌కొంటుంద‌న‌టంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఎవరైనా దర్శకుడు వీళ్లిద్దరి కాంబోలో ఓ మంచి సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: