- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న‌ భారీ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కనున్న‌ ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు హడావిడిగా నడుస్తున్నాయి. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. దాదాపు 1,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.


త్రిబుల్ ఆర్‌ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత రెండున్నర సంవత్సరాల పాటు రాజమౌళి తో పాటు . .. ఆయన తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, టోటల్ రాజమౌళి టీమ్ అంతా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు చాలా గ్రాండ్గా పరిచయం అయ్యారు. ఆ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ప్రీతిజింతా హీరోయిన్. ఇక‌ మహేష్‌కు చిన్నప్పటినుంచి ద‌ర్శ‌కేంద్రు డు రాఘవేంద్రరావును మామయ్య అని పిలవడం అలవాటు.


సినిమా షూటింగ్ సమయంలోను అలాగే పిలిచేవారట. ఈ సినిమాలో ప్రీతిజింతా తో ఓ ముద్దు సన్నవేశం ప్లాన్ చేశారు రాఘవేంద్రరావు. కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొచ్చి అందులో ఒక స్ట్రా వేసి హీరోయిన్ ప్రీతిజింతాకు ఇచ్చారట. ఆమె తాగిన తర్వాత ఆ స్ట్రాతో నే మహేష్ తాగాలంటూ సన్నివేశాన్ని మహేష్ కు చెప్పారట. ఇది చెప్పిన వెంటనే మహేష్ కోపంతో మామయ్య కావాలంటే నువ్వు చేసుకో . . .. ఆ పని నేను చేయను .. అని సీరియస్గా అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఓ సందర్భంలో ఈ విషయాన్ని రాఘవేంద్రరావు చెబుతూ పక ప‌కా నవ్వేశారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: