ఒకే రోజు ఒకే హీరో నటించిన రెండు సినిమాలు విడుదలయితే అది వారి అభిమానులకు విశేషమైన పండుగ. నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ , బంగారు బుల్లోడు రెండు ఒకేరోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఒక అగ్ర దర్శకుడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావటం చాలా అరుదైన విషయం. టాలీవుడ్ అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ ఘనత సాధించారు.. దర్శకుల లో ఈ రికార్డు ఉండడం గొప్ప విషయం.
చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన రాక్షసుడు , కమలహాసన్ హీరోగా ఒక రాధా ఇద్దరు కృష్ణులు సినిమాలు ఒకేరోజు అంటే .. 1986 అక్టోబర్ 2న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమా లు యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవలల ఆధారంగానే తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలుకు ఇళయరాజా సంగీతం అందించడం అప్పట్లో ఓ సంచలనం అని చెప్పాలి. ఇక రాక్షసుడు సినిమా అప్పట్లో అతి పెద్ద మ్యూజికల్ హిట్ సినిమాగా నిలిచింది. .
ఈ సినిమాలో అన్ని పాటలు తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసాయి. మరి ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు .. మల్లి జాజి అల్లుకున్న రోజు .. అనే పాట ఎప్పటికీ తెలుగు శ్రోతల హృదయాలలో అలా మారుమోగుతూనే ఉంటుంది. రాక్షసుడు సినిమాతో చిరంజీవికి తెలుగులో తిరిగిలేని క్లాస్ , మాస్ ఇమేజ్ వచ్చాయి. ఇక అప్పట్లో కోదండరామిరెడ్డి , ఎండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. అలాగే చిరంజీవి నటించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల కు కూడా యండమూరి వీరేంద్రనాథ్ స్వయంగా కథలు అందించారు. .