ఇలాంటి క్రమంలో బాలయ్యకు సంబంధించిన ఆల్ టైం రేర్ రికార్డు ఒకటి నెటింట వైరల్ గా మారుతుంది. బాలయ్య సినిమాల్లో ఉన్న ఓ డైలాగ్ రియల్ లైఫ్ కు బాగా సెట్ అయింది. హిస్టరీ క్రియేట్ చేయాలన్న మేమే.. దానిని బ్రేక్ చేయాలన్నా మేమే.. ఈ డైలాగులు బాలయ్య తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయడంలో రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించడంలో ఎన్నోసార్లు నిజం చేసి చూపించాడు. ఇక బాలయ్య సిడెడ్ కింగ్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు అక్కడి ఆడియన్స్ బ్రహ్మ రథం పడతారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన అన్ని సినిమాలు కలెక్షన్లు పరంగా రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి.
అయితే అయిన సాధించిన ఓ రికార్డ్ మాత్రం ఇప్పటివరకు ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరోలు కూడా టచ్ చేయలేకపోయారు. ఇకపై టచ్ చేయడం కూడా అసాధ్యం. ఇంతకీ ఆ రికార్డు ఏదో కాదు.. బాలయ్య నటించిన వరుస మూడు సినిమాలు అక్కడ కోటి రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాయి. అలా ఇప్పటివరకు ఏ స్టార్ హీరో సినిమాకు కూడా ఈ రేంజ్ కలెక్షన్‌లు రాలేదు. దీసి బట్టి అక్కడ ఆడియన్స్ బాలయ్యను ఏ రేంజ్‌లో ఆదరిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కేవలం సీడెడ్‌లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బాలయ్య సినిమాలు విపరీతమైన కలెక్షన్లు కొల్లగొడుతూ బ్లాక్ బాస్టర్ రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆరు పదుల వయసులోనూ ఈ రేంజ్‌లో రికార్డ్‌స్ సాధించడం సాధారణ విషయం కాదు. ఇకపై కూడా బాలయ్య ఈ సీడెడ్ రికార్డును టచ్ చేయడం హీరోలకు కష్టమే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.