సంక్రాంతికి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతోంది. డిఫరెంట్ కదా అంశాలతో సినిమా ప్రేక్షకుల దగ్గరికి తీసుకొస్తూ మంచి విజయాలని అందుకుంటున్నారు. అలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మంచి విజయాలను అందుకున్నారు. ఈసారి సంక్రాంతికి వెంకీతో కలిసి సంక్రాంతికి వస్తున్నామని సినిమాతో రాబోతున్నారు ఈ సినిమాలోని పాటలు ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు హీరో వెంకటేష్ మాత్రమే మిగిలిపోయారు.



సినిమా రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇటీవలే సంక్రాంతి వస్తున్నాం సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకున్నది. ఈ చిత్రం రెండు గంటల 24 నిమిషాలతో ఉన్నది.. సెన్సార్ బోర్డు కూడా U/A సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీంతో సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ ఇవ్వడం జరిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాను చూసి కడుపుబ్బ నవ్వుకున్నామని తెలిపారుట సెన్సార్ సభ్యులు.


గతంలో వెంకటేష్ నటించిన f2 సినిమా లాగే ఈ సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందట. ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ మధ్య వచ్చే సన్నివేశాలతో పాటుగా మీనాక్షి చౌదరితో వచ్చే సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయట. వీరందరి మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఆరంభం నుంచి క్లైమాక్స్ వరకు ఫన్నీగా సాగుతుందని ఎమోషనల్తో పాటు థ్రిల్ కు గురయ్యేలా సన్నివేశాలు ఉన్నాయని తెలుపుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కాస్త డల్ గా ఉన్న ఆ వెంటనే ఫన్నీ మూమెంట్స్ తో కథను నడిపిస్తారని టాక్ వినిపిస్తోంది.


మొత్తానికి వెంకటేష్ సంక్రాంతికి ఎలాంటి మూవీ తో రావాలో అలాంటి మూవీతోనే వస్తున్నారని సెన్సార్ సభ్యులు తెలుపుతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో 10 నుంచి 15 నిమిషాల్లో సినిమాని కట్ చేశారట. అలాగే బడ్జెట్ కూడా ఈ సినిమాకి చాలా తక్కువగానే ఉందని సమాచారం. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుక్ మై షో లో దుమ్ము దురిపేస్తోందట  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: