ఎంతో ఘోరంగా ప్రేమించుకున్న నయనతార , ప్రభుదేవా ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు .. దానికి కారణాలు ఏమిటి అన్నవి చూస్తే ఆసక్తిగా ఉంటాయి .. ప్రభుదేవా నయనతార మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో మరి ముఖ్యంగా చెన్నైలో ఎన్నో సినిమా ఈ వేడుకలకు పబ్లిక్ గానే తిరిగేవారు .. ఎక్కడ చూసినా జంటగా కనిపించేవారు పెళ్లి చేసుకోకుండానే సహజవనం కూడా చేశారు .. నయనతారతో ప్రేమలో పడి ప్రభుదేవా తన మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య రామలత్ కి కూడా దూరంగా ఉండి ఆమెకు విడాకులు ఇచ్చేశాడు .. కానీ అనుహింగా ప్రభుదేవా , నయనతార మంచి కూడా బ్రేకప్ జరిగింది .. వీరి బ్రేకప్ కారణం ఇండస్ట్రీలో రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి అందులో ఒక మాట మాత్రం చెన్నైలో బలంగా వినిపించింది.
పిల్లల కారణంగానే ప్రభుదేవా నయనతార బంధం బ్రేకప్ అయిందట .. ప్రభుదేవా మొదటి భార్యకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరూ మొదటి అబ్బాయి క్యాన్సర్ కారణంగా మరణించారు ..రామలత్ కు విడాకులు ఇచ్చి నయనతారను పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో తన ఇద్దరు పిల్లలు కూడా తమతోనే ఉంటారు అని నయనతారకు ప్రభుదేవా చెప్పారట .. నయనతార అందుకు ఒప్పుకోలేదు ఎన్నిసార్లు నచ్చ చెప్పాలని చూసినో కూడా నయనతార పిల్లలు తమతో ఉండటానికి అంగీకరించలేదట .. ఈ విషయంలో పెళ్లి అయితే కూడా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని ప్రభుదేవా అనుకున్నారు ఏమో తెలియదు కానీ నయనతారకు బ్రేకప్ చెప్పేశారు .. ఇక నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. నయనతారకు బ్రేకప్ చెప్పాక ప్రభుదేవా హిమానీ సింగ్ అనే ఫిజియోథెరపీస్ ని పెళ్లి చేసుకున్నారు .. వీరికి కూడా గత ఏడాది ఒక పాప పుట్టింది