అయితే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ డైలాగుని వాడేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దానికి కారణం బాబీ తెరకెక్కించిన 'డాకు మహారాజ్'. ఈ సినిమా పేరు వెరైటీగా పెట్టి సగం హిట్ కొట్టేసాడు . ఇక సినిమాను తెరకెకించిన విధానం చూసి బాలయ్య ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సంక్రాంతి కానుకగా థియేటర్స్ రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని చెక్ చేసే విధంగా టాక్ సంపాదించుకుంది. డాకు మహారాజ్ సినిమా బాలయ్య కెరియర్ లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిపోయింది . మొదటి రోజే ఏకంగా 30 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య కెరియర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
డాకు మహారాజ్ సినిమాతో బాలయ్య సోషల్ మీడియాని మడత పెట్టేస్తున్నారు . అంతేకాదు బాలయ్య ఆఖండ సినిమా నుంచి రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ చూస్తే అన్ని కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరినవి. అఖండ..సింహారెడ్డి ..భగవంత్ కేసరి అన్ని సినిమాలు మంచి విజయమందుకున్నాయి. కాగా ఇప్పుడు డాకు మహారాజు కూడా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . అంతేకాదు బాలయ్య డాకు మహారాజ్ సినిమాను ఓ రేంజ్ లో ప్రశంసిస్తూ పోకిరి డైలాగులు మ్యాచ్ చేస్తున్నారు అభిమానులు . అది సంక్రాంతి కాదు సమ్మర్ కాదు దసరా కాదు ఎప్పుడొచ్చినా సరే బాలయ్య సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అంటూ ఓ రేంజ్ లో సంక్రాంతి రేసులో నిలిచిన గేమ్ చేంజర్ సినిమా నెగిటివ్ టాక్ దక్కించుకోవడంపై ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు . బాలయ్య గట్టిగానే ఈసారి కలెక్షన్స్ సాధించి తన కాంపిటీటివ్ సినిమాలను తొక్కేశాడు అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మాట్లాడేసుకుంటున్నారు..!