టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. భవిష్యత్తులోనూ మరెంతోమంది స్టార్ హీరోలు వస్తారు. 70 సంవత్సరాలు పైగా ఉన్న టాలీవుడ్ చరిత్రలో ఎవరికి లేని ఒకే ఒక్క అరుదైన రికార్డు నందమూరి నట‌సింహం బాలకృష్ణ పేరు మీద మాత్రమే రికార్డుల్లో నిలిచింది. ఒక స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అయ్యి.. రెండు సినిమాలు కూడా వంద రోజులు ఆడటం టాలీవుడ్‌లో ఏ గొప్ప హీరోకు లేదు. భవిష్యత్తులోను ఉండబోదు అని చెప్పాలి. బాలయ్య హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ రెండు సినిమాలు 1993 సెప్టెంబర్ 3న ఒకేరోజు రిలీజ్ అయ్యాయి.


బాలకృష్ణ సినిమాతో.. మరో బాలకృష్ణ సినిమా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటం అప్పట్లో హైలైట్ ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. నిప్పురవ్వ సినిమా బాగానే ఆడిన.. కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాగా నిలిచింది. బంగారు బుల్లోడు సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. రమ్యకృష్ణ, రవినా టండన్‌ హీరోయిన్లుగా నటించారు. జగపతి ఆర్టిఫికెట్స్ బ్యాన్నర్ పై హీరో జగపతిబాబు తండ్రి బి. బి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన నిప్పురవ్వ.. బొగ్గుగ‌నుల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది.


బాలయ్యకి జోడిగా విజయశాంతి హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా ఇదే కావ‌డం విశేషం. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రావడానికి కారణం కూడా ఉంది. నిప్పురవ్వ షూటింగ్లో ప్రమాదం జరిగి రిలీజ్ ఆలస్యం అయింది. గనుల నేపథ్యంలో సన్నివేశాలు తీస్తూ ఉండగా ముగ్గురు చనిపోయారు. దీంతో కొంత కాలం పాటు షూటింగ్ నిలిచిపోయింది. కోర్టు గొడవలు కొలిక్కి వచ్చి విడుదల తేదీ నిర్ణ యించారు. అప్పటికే బంగారు బుల్లోడు కూడా షూటింగ్ పూర్తిచేసుకుని అనూహ్యంగా అదే రోజు రిలీజ్‌కు రావడం అనుకోకుండా జరిగింది. బంగారు బుల్లోడు పలు కేంద్రాలలో వంద రోజులు ఆడింది. నిప్పురవ్వ రాజమండ్రిలో వంద రోజులు ఆడటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: