ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రగ్యా జైస్వాల్ నటించారు. బాబి డియోల్ విలన్ పాత్రను పోషించారు. కాదా బాబి డియోల్ మొదటిసారిగా తెలుగు సినిమాలో నేరుగా నటించారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని పక్కా సూపర్ హిట్ అయిందని నందమూరి అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలకృష్ణ ఊర్వశితో కలిసి దబిడి దిబిడే పాటలో చెప్పులు వేశారు.
ఈ పాటలో డ్యాన్స్ కాస్త బోల్డ్ గా ఉందని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఈ పాట వల్ల ఫ్యామిలీ అభిమానులు సినిమాకి కలిసి రారేమోనని చిత్ర బృందం భయపడ్డారు. కానీ అవేమీ పట్టించుకోకుండా బాలకృష్ణ మీద ఉన్న అభిమానంతో సినీ అభిమానులు వచ్చి సినిమాను చూస్తున్నారు. సంక్రాంతి సెలవులు ఉండడంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూడడానికి ఎగబడుతున్నారు.
కాగా, డాకు మహారాజ్ సినిమా సక్సెస్ పార్టీని చిత్ర బృందం నిర్వహించారు. ఈ పార్టీలో బాలకృష్ణ నటి ఊర్వశి రౌతేలతో కలిసి సరదాగా స్టెప్పులు వేశాడు. "దబిడి దిబిడే" పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ సినిమాలో ఊర్వశి పోలీసు పాత్రలో అద్భుతంగా నటించారు. బాలయ్యతో కలిసి డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడే పాటలో చిందులు వేశారు. ఇక ఈ పార్టీకి సంబంధించిన వీడియోను ఊర్వశి రౌతేల తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు.