టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా .. గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ సినిమా ఒక్కడు. 2003 సంక్రాంతి కానుక గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ రోజుల్లోనే ఈ సినిమా 130 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. హైదరాబాద్ చరిత్రలో తొలిసారి ఏడు కేంద్రాలలో వంద రోజులు ఆడిన సినిమా గా ఒక్కడు రికార్డుల్లో నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై .. ఎమ్ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అనేక కష్టనష్టాలతో షూటింగ్ జరుపుకుంది.
అప్పటికే దేవి పుత్రుడు లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసి ఆ సినిమా డిజాస్టర్ కావడంతో .. ఎమ్.ఎస్. రాజు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ఈ టైంలో గుణశేఖర్ దర్శకత్వంలో ఒక్కడు సినిమా తీసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజుల్లోనే రూ.2 కోట్లు ఖర్చుపెట్టి రామోజీ ఫిలిం సిటీలో ఛార్మినార్ సెట్ వేశారు. భూమికను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే భూమికకు పొంగు రావడంతో .. ఆమె గ్లామర్ బాగా దెబ్బతింది. ఇందుకోసం 5 - 6 నెలలు షూటింగ్ ఆపేశారు.
ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ సినిమా దాదాపు రెండు సంవత్సరాలు పాటు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ముందుగా గుణశేఖర్ అనుకున్న టైటిల్ అతడే ఆమె సైన్యం. అయితే.. ఇది ఎవరో రిజిస్టర్ చేశారు. ఎంత బతిమాలిన ఇవ్వలేదు. చివరకు రెండో టైటిల్ గా కబడ్డీ అని అనుకున్నారు.. చివరికి అటూ, ఇటూ తిరిగి ఒక్కడు అనే పేరు ఫైనల్ చేశారు. ఈ టైటిల్‌కు అందరూ ఒకే చెప్పడంతో అలా ఒక్కడు టైటిల్ ఫిక్స్ అయింది.