సుమారుగా 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా థియేటర్లోకి రావడంతో అందరి హృదయాలను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని కారణాల చేత ఎన్నో వివాదాలు, వాయిదాలు పడుతూ చివరికి ఇప్పుడు విడుదలయ్యింది. డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్లో ఈ సినిమా విడుదల అవ్వగా.. ఈ సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో చాలా ఆసక్తికరమైన చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమాని ఎవరు పట్టించుకోరని అందరూ అనుకున్నారు కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా థియేటర్లో తెగ సందడి చేస్తుందట.
ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ సన్నివేశాలు కథ స్క్రీన్ ప్లే కి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతున్నారట. చెన్నై మీడియా ప్రకారం ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నదట. అయితే సినిమా ఎప్పుడు విడుదలైనా కూడా దాని వినోదాత్మక మాత్రం అలాగే కనిపిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సంతానం, విజయ్ ఆంటోనీ, విశాల్ వంటి వారు నటించారు. డైరెక్టర్ సుందర్ సి.వినోద్ కామెడీ చిత్రాలను తెలకెక్కించే డైరెక్టర్ గా పేరు పొందారు. ఈసారి కూడా తన మార్కు కంటెంట్తో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇందులో సునీల్ శెట్టి, వివేక్ పాత్రలు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయట. 12 ఏళ్ల తర్వాత వచ్చిన కూడా ఈ సినిమా ఏ మాత్రం తగ్గకపోవడంతో విశాల్ రేంజ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.