అలాంటి సిమ్రాన్ అప్పట్లో డ్యాన్స్ మాస్టర్ అయిన రాజు సుందర్ ని చాలా గాఢంగా ప్రేమించిందన్న పుకారు ఉంది .. వీరి రిలేషన్ పెళ్లి వరకు కూడా వెళ్లిన సమయంలో ఈ హీరోయిన్ వేరే హీరోతో చేసిన సినిమా కారణంగా ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని అంటారు .. సిమ్రాన్ ఎంతోమంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది .. బాలకృష్ణ , విజయశాంతితో హిట్ ఫెయిర్ సంపాదించుకున్నాక ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోయిన్లలో సిమ్రాన్ తో బాలయ్య మంచి హిట్ ఫెయిర్ అన్న పేరు తెచ్చుకున్నారు .. అలాగే ఈ ముద్దుగుమ్మ కమలహాసన్ తో బ్రహ్మచారి , పంచతంత్రం , బ్రహ్మచారి లాంటి సినిమాలలో నటించింది .. వరుసగా మూడు సినిమాలలో కమల్‌తో నటించేసరికి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అన్న పుకార్లు వినిపించాయి ..
అంతేకాకుండా సినిమా షూటింగ్లో భాగంగా కమలహాసన్ తో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా సిమ్రాన్ నటించింది .. తన ప్రేయసి మరో హీరోతో రొమాన్స్ చేయడం ఇష్టం లేని రాజు సుందరం అలాంటి సన్నివేశాలలో నటించవద్దని చెప్పిన కూడా సిమ్రాన్ రొమాంటిక్ సీన్లలో నటించింది .. అంతేకాకుండా కమలహాసన్ తో ఓ సినిమాలో లిప్ లాక్ సన్నివేశంలో కూడా నటించింది .. అలా వీరిద్దరి మధ్య మొదలైన గొడవలు చివరికి పెరిగి పెద్దవి అయ్యి అపార్థానికి దారితీసి ఇద్దరు కలిసి బ్రేకప్ చెప్పుకునే వరకు వచ్చేసాయి .. ఆ తర్వాత సిమ్రాన్ దీపక్ అనే వ్యక్తిని పెళ్లాడింది ..