శ్రీదేవి అవమానించింది మరిఎవరినో కాదు మెగాస్టార్ చిరంజీవిని శ్రీదేవి , చిరంజీవి సినిమాలలో పొగరు చూపించడంతో చాలా సినిమాలలో అవకాశాలు కోల్పోయిందన్న గుసగుసలు అప్పట్లో ఉన్నాయి .. మొదట వీరిద్దరి కాంబినేషన్లో కొండవీటి దొంగ సినిమా తెరకెక్కించాలని అనుకున్నారు .. సినిమా స్టోరీ మొత్తం హీరోయిన్ అయినా శ్రీదేవి ఈ సినిమా టైటిల్ కొండవీటి దొంగ తీసేసి కొండవీటి రాణి అని పెట్టాలని డిమాండ్ చేసిందట .. అంతేకాకుండా సినిమాలో చిరంజీవి కంటే తన పాత్రికి ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని అలా అయితేనే సినిమాలలో నటిస్తానని కూడా కండిషన్ పెట్టిందట .. ఈ కండిషన్ కు ఒప్పుకొని దర్శక నిర్మాతలు ఏ సినిమాలో అయినా హీరోయిన్ కంటే హీరోకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు .. అది ముందుగా తెలుసుకోమని ఆమెను పక్కనపెట్టి ఆ స్థానంలో హీరోయిన్ రాధిని తీసుకున్నారు ..
ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే .. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వజ్రాలు దొంగ సినిమా కూడా మిస్సయింది .. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సమయంలో కూడా మొదటి టైటిల్ జగదేకవీరుడు అని అనుకున్నారట .. రాఘవేంద్రరావు సినిమా కథ విన్నాక శ్రీదేవి అతిలోకసుందరి పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో రాఘవేంద్రరావు చేసేదేమో లేక జగదేకవీరుడు అతిలోకసుందరి అనే టైటిల్ పెట్టారట .. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది .. ఇక చిరంజీవి - శ్రీదేవి కాంబినేషన్లో మోసగాడు , జగదేకవీరుడు అతిలోకసుందరి , ఎస్పీ పరశురాం లాంటి సినిమాలు వచ్చాయి ..