సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలు మాత్రం ఎక్కడా కూడా తమ హీరోని తగ్గే విధంగా మాట్లాడిన ట్రోల్ చేసిన అస్సలు సహించట్లేదు.  వెంట వెంటనే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ బ్యాక్ ఫైర్ ఇచ్చేస్తూనే వస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కొంతమంది స్టార్ హీరోల ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ట్రోల్ చేశారో అల్లాడించేశారో.. ఆయన పరువును మట్టి కలిపేలా ప్రయత్నించారో అందరికీ తెలిసిందే.  సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ది తప్పు అంటూ కావాలనే కొందరు టార్గెట్ చేసి అల్లు అర్జున్ పై పర్సనల్ అటాక్ చేశారు . అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో ఆయనపై ట్రెండ్ అయిన మీమ్‌స్ జరిగిన ట్రోలింగ్ ఎప్పటికీ బన్నీ ఫాన్స్ మర్చిపోలేరు .


అంత దారుణమైన పదాజాలంతో అల్లు అర్జున్ పై చీప్ మిమ్స్ కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు.  అయితే అల్లు అర్జున్ పుష్ప 2 స్టన్నింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది.  బాహుబలి 2 రికార్డ్స్ సైతం బద్దలు కొట్టి నార్త్ లో అత్యధిక వసూలు కలెక్ట్ చేసిన రెండో మూవీగా రికార్డ్ నెలకొల్పింది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఇండియాలోనే ఫాస్ట్ గా వెయ్యి కోట్లు క్రాస్ చేసిన మూవీగా చరిత్ర సృష్టించింది . త్వరలోనే 2000 కోట్లు దాటేస్తుంది . ఈ సినిమా అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఇప్పుడు సంక్రాంతి రేసులో కొన్ని సినిమాలు నిలుచున్నాయి . ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా 'డాకు మహారాజ్' సినిమా రిలీజ్ అయిపోయాయి . గేమ్ చేంజర్ పరిస్థితి వేరేలా ఉంది . కథ ఫ్లాప్ నటన హిట్ అన్న టాక్ వచ్చింది . "డాకు మహారాజ్" సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అంటున్నారు అభిమానులు. ఇలాంటి మూమెంట్లోనే అసలు నటనపరంగా ఎవరు ది బెస్ట్.. బన్నీ నటించిన పుష్ప2  సినిమాలో బన్నీ నటన బాగుంది అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటన బాగుంది అంటున్నారు . డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య నటన వేరే లెవెల్ అంటూ పొగిడేస్తున్నారు.



అసలు ఈ ముగ్గురిలో ఎవరి నటన బాగుంది ..? ఎవరు ఇండస్ట్రీలో తోపైన హీరో..? అంటూ పలు పోల్స్ కండక్ట్ చేస్తున్నారు . కాగా ఇదే మూమెంట్లో.. బన్నీ ఫాన్స్ బన్నీకే సపోర్ట్ చేస్తున్నారు.  రామ్ చరణ్ ఫాన్స్ రామ్ చరణ్ కి బాలయ్య ఫ్యాన్స్ బాలయ్య కి సపోర్ట్ . కాగా మిగతా హీరోల ఫ్యాన్స్ ఎవరికీ సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ గా మారింది.  మెగా ఫాన్స్ ఇప్పుడు బన్నీగా యాంటీగా ఉన్నారు. అందుకే బన్నీకి సపోర్ట్ చేయడం లేదు . అయితే ప్రభాస్ , జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు.



కాగా చరణ్ కి బన్నీ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం లేదు. తారక్ ..ప్రభాస్ ఫ్యాన్స్ బన్నీకి సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు రామ్ చరణ్ కి వాళ్ళు నెగిటివ్గా మారిపోయారు . మహేష్ బాబు ఫ్యాన్స్ రామ్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు . అలాగే మెగా ఫాన్స్ సపోర్ట్ చేస్తున్నారు.  నందమూరి బాలయ్యకు మాత్రం ప్రతి హీరో ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు . అటు బన్నీ ..ప్రభాస్ ..మహేష్ బాబు ..నాని ..చరణ్ ..వెంకటేష్ అందరి హీరోల ఫ్యాన్స్ బాలయ్యకు సపోర్ట్ చేస్తూ సీనియారిటీ ఏజ్ లోను ఇలాంటి ఒక వైల్డ్ పర్ఫామెన్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు అంటూ ప్రశంసించేస్తున్నారు.  నిజంగా ఆ విషయంలో బాలయ్య నెంబర్ వన్ అంటూ పొగిడేస్తున్నారు.. అయితే పుష్ప2 సినిమాలో అన్ని సీన్స్ ఒక లెక్క అని జాతర ఎపిసోడ్ మాత్రమే వేరే లెవల్ అని ఆ జాతర ఎపిసోడ్ ని వేరే ఏ హీరోతో కంపేర్ చేసుకోలేము .. అది బన్నీకే చెల్లుతుంది అంటూ కూడా బన్నీని పొగిడేస్తున్నారు . మధ్యలో డమ్మి అయింది రామ్ చరణ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: