ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ డామినేషన్ కొనసాగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఎక్కువ థియేటర్లలో రన్ అవుతుండటం డాకు మహారాజ్ కు ప్లస్ కానుందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ మూవీ రొలిరోజే ఏకంగా 56 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బాలయ్య సినీ కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తోంది.
డాకు మహారాజ్ మూవీ కలెక్షన్ల విషయంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. డాకు మహారాజ్ ఈరోజు, రేపటి కలెక్షన్లతో సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. డాకు మహారాజ్ సినిమాకు పార్ట్2 ఉంటుందని అయితే సీక్వెల్ కు బదులుగా ప్రీక్వెల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. డాకు మహారాజ్ సక్సెస్ సితార నిర్మాతలకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలుస్తోంది.
డాకు మహారాజ్ సినిమాలో ఆసక్తికర ట్విస్టులతో తెరకెక్కడం కూడా ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. డాకు మహారాజ్ ఇతర భాషల్లో కూడా అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.