గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విడుదలైన డాకు మహారాజ్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలను పోషించారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఈ సినిమా నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీని ఘనంగా నిర్వహించింది.

డాకు మహారాజ్ సినిమా సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియోను విశ్వక్సేన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ చెంపల పైన బాలయ్య ముద్దులు పెట్టారు. సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ కూడా బాలయ్య బాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.


ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈ పార్టీలో ఊర్వశి రౌతేలతో కలిసి బాలయ్య మరోసారి స్టెప్పులు వేశారు. దబిడి దిబిడి పాటకు డ్యాన్స్ చేస్తూ సంబరంలో మునిగిపోయారు. బాలయ్య బాబు స్టెప్పులు వేస్తూ ఊర్వసి వద్దకు రాగానే ఆమె పక్కకు వెళ్లిపోయింది. ఈ వీడియోను ఊర్వశి తన ఇన్ స్టాలో షేర్ చేసుకోవడంతో అది వైరల్ గా మారుతుంది. దబిడి దిబిడి పాట స్టెప్పులపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.


ఎమ్మెల్యే అయిన బాలకృష్ణతో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అసభ్యకరంగా స్టెప్పులు వేయించారంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. కూతురు వయసు ఉన్న ఊర్వసి రౌతేలతో కలిసి బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడం చాలా అసభ్యకరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరోసారి బాలయ్య దబిడి దిబిడి పాటకు ఊర్వశితో కలిసి స్టెప్పులు వేయడంతో అభిమానులు సీరియస్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: