అల్లు అర్జున్‌ ప్ర‌ధాన పాత్ర‌ లో న‌టించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం పుష్ప 2 ది రూల్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన ఈ సినిమా లో రష్మిక కథానాయికగా న‌టించింది. డిసెంబ‌ర్ 05 న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే.ఇప్ప‌టికే బాహుబ‌లి 2 రికార్డుతో పాటు బాలీవుడ్ అత్య‌ధిక క‌లెక్ష‌న్ల రికార్డును బ‌ద్ద‌లుకొట్టిన ఈ చిత్రం రూ.2000 కోట్ల దిశ‌గా దూసుకెళుతుంది. అయితే ఈ క్ర‌మంలోనే పుష్ప 2 మేక‌ర్స్ సినిమా ల‌వ‌ర్స్‌ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో విడుద‌ల‌కు ముందు డిలీట్ చేసిన 20 నిమిషాల‌ను యాడ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ముందు గా జ‌న‌వ‌రి 11న యాడ్ చేద్దామ‌నుకున్నా మేక‌ర్స్ అనుకోని కార‌ణాల వ‌ల‌న జ‌న‌వ‌రి 17కి వాయిదా వేసింది. తాజాగా 20 నిమిషాల డిలీటెడ్ సీన్స్‌కి సంబంధించిన ప్రోమో ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం.ఈ డిలీటెడ్ సీన్స్‌ లో పుష్ప ఎంట్రీ సీన్‌లో వ‌చ్చిన ఫైట్‌లో వాట‌ర్‌లో ప‌డ‌డంతో క‌ట్ అయిన సీన్‌ను యాడ్ చేస్తుండ‌గా.. దీనితో పాటు క‌న్న‌డ న‌టుడు తార‌క్ పొన్న‌ప్పతో వచ్చే యాక్ష‌న్ సీన్‌ని కూడా జ‌త చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.ఈ క్రమం లో ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన తాజా కంటెంట్ మరియు డైలాగ్‌ల కోసం ప్రోమో కు మంచి స్పందన లభించింది.కేవలం 20 నిమిషాల అదనపు ఫుటేజ్ కోసం అభిమానులు పుష్ప 2ని మళ్లీ చూడటానికి తిరిగి వస్తారో లేదో చూడాలి. రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నారు. సహాయ తారాగణం లో రావు రమేష్, జగపతి బాబు, అజయ్, సునీల్, అనసూయ తదితరులు ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ పాన్-ఇండియన్ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: