అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్లో గానే ఉంది అంటూ నెగిటివ్ టాక్ వచ్చింది. మరికొందరు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం మ్యూజిక్ అంటూ ఘాటుగా ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బాలయ్య డాకు మహారాజు మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది . హైలైట్ ఏంటంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మ్యూజిక్ అంటున్నారు జనాలు . తెరపై బాలయ్య హీరోగా కనిపించాడు అని కానీ ఈ సినిమాకి రియల్ హీరో మాత్రం తమన్ నే అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పేసుకుంటున్నారు .
బాలయ్య నటిస్తే తమన్ దానికి జీవం పోసాడు అని ..సౌండ్ తోనే థియేటర్స్ ను బ్లాస్ట్ చేశాడు అని నిజంగా తమన్ వేరే లెవెల్ టాలెంట్ పర్సన్ అంటూ పోగిడేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కి మండిపోతుంది. తమన్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . రామ్ చరణ్ కి ఒకలా మ్యూజిక్ ఇచ్చావ్ బాలయ్యకి మరొకల మ్యూజిక్ ఇచ్చావ్. నీ మనసులో దురుద్దేశం ఏంటి..? అంటూ ఫైర్ అయిపోతున్నారు. అంతేకాదు నువ్వు కావాలని గేమ్ చేంజర్ సినిమా హిట్ అవ్వకుండా ఉండడానికి సంక్రాంతి రేసు లో నిలిచిన బాలయ్య డాకు మహారాజు సినిమా హిట్ అవ్వడానికి ఇలా డబల్ గేమ్ ఆడాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమన్ పేరు హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతుంది..!