ఇక రీసెంట్ టైమ్స్ లో అయితే రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్, తాజాగా ప్రగ్యా జైస్వాల్ కూడా బాలయ్య తో రిపీటెడ్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే .. బాలయ్య, దివంగత హీరోయిన్ దివ్యభారతి కాంబినేషన్లో ధర్మక్షేత్రం సినిమా వచ్చింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ పరంగా సూపర్ డూపర్ హిట్. కమర్షియల్ గా బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. అప్పట్లో దివ్యభారతి బాలీవుడ్ ముద్దుగుమ్మ. తన అంద చందాలతో చిన్న వయసులోనే దేశాన్ని ఊపేసింది. టాలీవుడ్ లోను ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నటించింది.
అయితే బాలయ్య, దివ్యభారతి కాంబినేషన్‌లో మరో సినిమా కూడా రావాల్సి ఉంది. అదే నిప్పురవ్వ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో.. బొగ్గుగనుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా నిప్పురవ్వ. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ముందుగా దివ్యభారతిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఆ టైంలో ఆమె బిజీగా ఉండడంతో కాల్ షీట్లు ఇవ్వలేకపోయింది. దీంతో విజయశాంతి ని హీరోయిన్గా తీసుకున్నారు. బాలయ్య, విజయశాంతి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు తెరకెక్కి చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమాగా నిప్పురవ్వ నిలిచిపోయింది. ఆ తర్వాత మళ్లీ విజయశాంతి, బాలకృష్ణ కలిసి నటించనే లేదు.