తమిళ సినిమాలో స్టార్  దర్శకుడు  శంకర్.  జెంటిల్ మేన్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన మొదటి సినిమాతోనే అందరినీ తనవైపు తిప్పుకున్నారు. తర్వాత  వరుస సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కమల్ హాసన్ తో ఇండియన్ సినిమా తీసి భారతీయ సినీ లోకాన్ని తమిళ సినిమా వైపు చూసేలా చేశారు.అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీశారు. రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించారు. ఎస్.జె. సూర్యా ప్రధాన విలన్ గా నటించిన ఈ చిత్రంలో అంజలి, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం తదితరులు నటించారు.ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్స్ తో నడుస్తుంది.తమిళంలో ఎవరూ దొరక్కపోవడంతో తెలుగులో చిరంజీవితో అనుకున్నాడుకానీ చివరకు రామ్ చరణ్, దిల్ రాజు దొరికి బలైపోయారు. భారీ నష్టాల్లో దిల్ రాజు కూరుకుపోయే అవకాశం ఉందంటున్నారు. తర్వాత ఏ హీరో కూడా శంకర్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు కనపడటంలేదు. భారతీయుడు2 తీసే సమయంలోనే భారతీయుడు3 కూడా దాదాపుగా పూర్తిచేశాడు.

ఇదిలావుండగా ఇటీవల ఓ డిజిటల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ బయోపిక్  సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి మాట్లాడారు. “నేను ఇప్పటివరకు బయోపిక్ సినిమా తీయాలని అనుకోలేదు, కానీ ఒకవేళ తీస్తే అది రజినీ సార్ గురించే” అని అన్నారు.సూపర్ స్టార్ గురించి ప్రజలకు ఇప్పటికే తెలిసిన దానికంటే ఎక్కువ చెప్పలేమని దర్శకుడు చెప్పారు. ఆయన గురించి, ఆయన ప్రయాణం గురించి అందరికీ తెలుసు కాబట్టి, జీవిత చరిత్ర సినిమా తీయాలంటే తనకు ముందుగా రజినీకాంత్ పేరే గుర్తుకొస్తుందని అన్నారు.రజినీకాంత్ పాత్రకు ఎవరు నటిస్తారని అడిగినప్పుడు, దర్శకుడు సరదాగా “ఇప్పుడే ఈ ఆలోచన వచ్చింది. మీరు అడిగేసరికి స్పార్క్ వచ్చింది. అయితే అది జరుగుతుందో లేదో చూద్దాం” అని అన్నారు.ఇప్పటికే రజినీకాంత్ గురించి జీవిత చరిత్ర సినిమా తీస్తున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. అలాగే, నటుడు ధనుష్ కూడా ఒకసారి రజినీకాంత్ గురించి జీవిత చరిత్ర సినిమా తీయాలనే తన కోరికను వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ధనుష్ ఒప్పుకున్నాడా? లేదా? అనేది తెలియదు. ఒప్పుకుంటే ధనుష్ స్క్రిప్ట్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి. తర్వాత శంకర్ కు బలవబోయేది ధనుష్ కావొచ్చంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: