- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మహేష్ బాబు కెరీర్‌లో ఫస్ట్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాగా 2003 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఒక్కడు సినిమా నిలిచింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. అప్పటికే మెగాస్టార్ చిరంజీవితో మృగరాజు లాంటి అతిపెద్ద డిజాస్టర్ సినిమా తీసిన గుణశేఖ‌ర్‌ను టాలీవుడ్ లో ఏ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు. అస‌లు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ‌డం లేదు . . ఆ టైంలో గుణశేఖర్ కసితో ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా తీసి తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. . ఒకరోజు పేపర్లో బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ ఇంటర్వ్యూ వచ్చింది. .


వాళ్ల‌ తండ్రికి క్రీడలు అంటే ఆసక్తి లేకపోవడం .. గోపీచంద్ ఎన్నో కష్టాలు పడి స్పోర్ట్స్ ఛాంపియన్గా ఎదగటం .. ఇదంతా గుణశేఖర్‌కు ఎంతో ఆసక్తికరంగా .. స్పూర్తివంతంగా.. అనిపించింది. దీంతో తన కథలో హీరో కూడా ఇలాంటి వాడిగానే ఉండాలని తండ్రి వద్దు అంటున్న స్పోర్ట్స్ మెన్ గా ఎదగాలనుకుంటాడని .. స్క్రిప్ట్ రాసుకున్నాడు. గోపీచంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ స్ఫూర్తితో కథను డెవలప్ చేసుకున్నాడు. పూర్తి కథ రాసుకుని వెళ్లి మహేష్ ను కలిసి కథ చెప్పి ఒప్పించాడు.


నిర్మాతగా ఎమ్మెస్ రాజు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. దేవీపుత్రుడు లాంటి డిజాస్టర్ సినిమా తీసిన ఎమ్మెస్ రాజు.. మృగరాజు లాంటి అతిపెద్ద డిజాస్టర్ తీసిన గుణశేఖర్ కాంబినేషన్‌లో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడా ? ఇక మహేష్ బాబు పని గోవిందా .. అని టాలీవుడ్ లో అందరూ గుసగుసలాడుకున్నారు. అలాంటిది 130 కేంద్రాలలో వంద రోజులు ఆడి మహేష్ బాబు కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచి అందరినోళ్లు ముయించింది ఒక్కడు టీం. .

మరింత సమాచారం తెలుసుకోండి: