- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయమైన మహేష్ బాబుకు తొలి సినిమా సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత మురారి యావరేజ్. అనంతరం వరుసగా టక్కరి దొంగ , బాబి సినిమాలు బాగా డిసప్పాయింట్ చేశాయి. అంతకుముందు యువరాజు , వంశీ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. ఈ లెక్కన చూస్తే 1999 లో వచ్చిన రాజకుమారుడు నుంచి నాలుగేళ్ల పాటు మహేష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా లేదు. కెరీర్ పరంగా అడుగులు పడుతూ, లేస్తున్నాయి.


ఈ టైంలో 2003 సంక్రాంతి కానుకగా గుణశేఖర్ దర్శకత్వంలో.. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా ప్రే క్షకులు ముందుకు వచ్చింది. భూమిక హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కనీవిని ఎరుగని రీతిలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న ఎన్నో పాత రికార్డులకు పాత్ర వేసింది. అంతకుముందు చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా 122 కేంద్రాలలో వంద రోజులు ఆడితే .. ఒక్కడు 130 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.


ఇందులో తొలి రిలీజ్ 100 కేంద్రాలలో వంద రోజులు ఆడితే.. సెకండ్ రిలీజ్ మరో 30 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. థర్డ్ రిలీజ్ లో కూడా మరో ఏడు కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత నెల రోజులు తర్వాత రిలీజ్ చేసిన కొన్ని సెంటర్లలో కూడా వంద రోజులు ఆడిందంటే ఒక్కడు సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. 22 సంవత్సరాల క్రితమే ఈ సినిమాకు రూ.9 కోట్లు ఖర్చు చేశారు. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన ఛార్మినార్ సెట్ కోసమే ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు అయింది. ఒక్కడు ఫుల్ రన్ టైంలో రూ.39 కోట్లు వసూలు చేసింది. అలా మహేష్ బాబు కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: