సినీ ఇండస్ట్రీ లో వివాదాలకు దూరంగా వుంటూ తన పని తాను చేసుకుపోయే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు.ప్రస్తుతం ఆయన తన కొత్త చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'తో సందడికి సిద్ధమవుతున్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రేపు అనగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా తమ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు వెంకటేశ్. అన్ని చిత్రాలకు భిన్నంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ పోస్టర్స్ దగ్గర్నుంచి టీజర్, ట్రైలర్ వరకు ప్రతి విషయం పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మరోవైపు యూట్యూబ్ లో గోదారి గట్టు మీద సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.ఇదిలావుండగా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న వెంకటేష్, తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ తన రాబోయే సినిమాల కోసం నాలుగు పెద్ద నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాటిలో సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, వైజయంతి మూవీస్, సితార ఎంటర్టైన్‌మెంట్స్ ఉన్నాయి. ఈ సంస్థలు ఆయన కోసం స్క్రిప్టులను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.ఈ ప్రాజెక్టులన్నీ డిఫరెంట్ కథాంశాలతో ఉంటాయని, త్వరలో అధికారిక ప్రకటనలతో ప్రేక్షకులను అలరించనున్నారని పేర్కొన్నారు. వెంకటేష్ నెమ్మదిగానే, బలమైన కథలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తాను ఎలాంటి కొత్త ప్రాజెక్టును ఫైనలైజ్ చేయలేదని, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం విడుదల తరువాత తన తదుపరి సినిమా గురించి స్పష్టమైన ప్రకటన ఉంటుందని వెల్లడించారు.ఈ నాలుగు నిర్మాణ సంస్థల్లో ఒకటి లేదా ఎక్కువ సంస్థలతో కలిసి ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నారని సమాచారం. ఇక దీని పై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: