గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేసిన అనంతరం రామ్ చరణ్ నుంచి వచ్చిన ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సినిమా విడుదలైన మొదటి రోజు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఓపెనింగ్స్ కూడా భారీగానే వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద గేమ్ చేంజర్ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రెండో రోజు కూడా థియేటర్ల వద్ద తన జోరును చూపించింది. జనవరి 10న విడుదలైన గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఇంతగా వసూళ్లను సాధిస్తుందని ఎవరు ఊహించలేదు.
మొత్తంగా రూ. 186 కోట్ల గ్రాస్ వసూలు చేసి గేమ్ చేంజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంది. సినిమా రెండో రోజు కూడా కలెక్షన్లు భారీగానే వచ్చాయి. దాంతో అభిమానులు తమ సంతోషాన్నీ వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా రెండో రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 21.50 కోట్లు సొంతం చేసుకుంది. మొదటి రోజుతో పోలిస్తే కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు.
ఎస్ జె సూర్య, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం వంటి నటీనటులు కీలకపాత్రను పోషించారు. కాగా గేమ్ చేంజర్ సినిమా బాగుందని కొంతమంది అంటుంటే మరి కొంతమంది ఈ సినిమాను గేమ్ చేంజర్ కాదు గేమ్ ఓవర్ అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ సినిమా మాత్రం థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే.. నిన్న రాత్రి డాకు మహా రాజ్ సినిమాను బ్రేక్ చేసింది గేమ్ ఛేంజర్. నిన్న రాత్రి షోకు 10.97K టికెట్లు గేమ్ చేంజర్ వి అమ్ముడయ్యాయి. బాలయ్య డాకు మహారాజ్ టికెట్లు 6.89K మాత్రమే అమ్ముడయ్యాయి.