సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దిగ్గజ దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. SSMB - 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందులో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని రాజమౌళి కూడా ప్లాన్ చేస్తూ.. నటీనటులు ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అంతేకాదు ఈ సినిమాలోని లొకేషన్స్ కోసం విదేశాలలో జక్కన్న ఒక్కడే కష్టపడుతూ ఫైనల్ చేస్తున్న విషయం తెలిసిందే.ఇక చాలాకాలంగా మహేష్ బాబు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చేసింది.ఎట్టకేలకు మహేష్ బాబు - రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా ఈమూవీ ఓపెనింగ్ చాలా సింపుల్ గా జరిగింది. అంత భారీబడ్జెట్ తో పెద్ద స్థాయిలో తెరకెక్కుతున్న ఈసినిమా ఓపెనింగ్ ను చాలా సింపుల్ గా ఏమాత్రం హంగు ఆర్బాటాలు లేకుండా చేశాడు జక్కన్న.

అయితే ఈ ఓపెనింగ్ ఈవెంట్ ను బయటకుచూపించకపోవడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమా ఈవెంట్ ను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇదిలావుండగా
ఇక తాజాగా ఈసినిమాకు సబంధించి మరో వార్త వైరల్ అవుతోంది. ఈసినిమాలో మహేష్ బాబు అన్నగా వెంకటేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ గతంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది.ఇక ఈసారి కూడా వీరి కాంబినేషన్ సెంటిమెంట్ గా కలిసి వస్తుంది అని భావిస్తున్నారట. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. టాక్ మాత్రం వినిపిస్తుంది. ఇక ఈసినిమాలో మహేష్ బాబు లుక్ ఓపెనింగ్ లో కనిపించింది. మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయి. కుర్రహీరోలు కుళ్లుకునేలా అమ్మాయిల మనసుల్లో మరోసారి రాజకుమారుడు అనిపించుకున్నాడు మహేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: