- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక పేరు దివంగ‌త విశ్వ విఖ్యాత న‌ట సౌర్వ‌భౌమ‌ నందమూరి తారకరామారావు. పౌరాణిక పాత్రలో న‌టించ‌డం ఆయనకు కొట్టినపిండి. డైలాగులు , హవభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పౌరాణిక పాత్రలకు, చిత్రాలకు ఎన్టీఆర్ నిఘంటువు. రాముడు , కృష్ణుడు , దుర్యోధనుడు , భీముడు , రావణుడుగా ఎన్నో పాత్రలో ఒదిగిపోయారు. కృష్ణుడిగా దాదాపు అత్యధిక సార్లు తెరపై కనిపించి రికార్డు క్రియేట్ చేశారు. అస‌లు తెలుగు ప్ర‌జ‌ల కు కృష్ణుడు అంటే దేవుడి రూపం క‌న్నా ముందు ఎన్టీఆర్ రూప‌మే గుర్తు కు వ‌చ్చేస్తుంది.


మరి అంత పేరు, ప్రఖ్యాతలు సంపాదించిన ఎన్టీఆర్ . . తన సినిమా ప్రస్థానంలో నారదుడు , హనుమంతుడు పాత్రలను మాత్రం వేయలేదు. ఇదే విషయం గురించి ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడుతూ .. నారదుడుగా ఆలోచించాను . . , హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా .. సర్వజ్ఞుడిగా .. గంభీరంగా ప్రదర్శించవచ్చు . . కానీ .. నా రూపం అందుకు సహకరించే ఛాన్స్ లేదని .. సాహసం చేయలేదు. నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం అని తెలిపారు.


నా శరీరం కాస్త భారీ అవుతుందని ఆ ఆలోచన రానివ్వలేదు .. రంగారావు గారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా .. పర్సనాలిటీలు ఒప్పుకోవు అని తెలిపారు. ఇక హనుమంతుడి విషయానికొస్తే .. నా మొఖం ఎప్పుడు అందుకు సూట్ కాదు .. హనుమంతుడి పాత్ర మాస్క్ తో నటించాలి. ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువ కావాలి అని విశ్లేషించారట. అలా ఆ రెండు పాత్ర లు ఎన్టీఆర్ వేయ లేక‌పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: