మెగాస్టార్ చిరంజీవి అల్లువారి ఆడపడుచు సురేఖ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు మీడియాలో ఉన్నాయి .. ఇప్పటికే చిరంజీవి పెళ్లి గురించి ఎంతోమంది చర్చించుకుంటూ ఉంటారు .. చిరంజీవి చేరిన చొక్కాతోనే పెళ్లి చేసుకున్నారు .. పెళ్లి సమయంలో అల్లు రామలింగయ్య మొహం  వెలిగిపోతూ ఉంటే చిరంజీవి మొహం మాత్రం కాస్త వాడు పోయిందట .. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చాలా ఫన్నీగా చెప్పుకున్నారు .. అంతేకాదు పెళ్లి జరిగిన సమయంలో చిరిగిన‌ చొక్కా వేసుకున్నారని కొంతమంది అంటే ఏదైతే నీకేంటి అని చిరంజీవి కాస్త కసురుకున్నారట .. ఇదిలా ఉంటే చిరంజీవి , సురేఖ పెళ్ళికి సత్యనారాయణ అనే మిస్టరీ యూనియన్ కారణమయ్యారట .. ఆయన ఎవరు వీరి పెళ్లికి ఆయన ఎలా కారణమయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం .


 చిరంజీవి ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు .. ఓ రోజు అల్లు రామలింగ‌య్య‌ ఇంటిపై వర్షం లో ఉండే సత్యనారాయణ అనే వ్యక్తి కోసం చిరంజీవి అల్లు రామలింగయ్య‌ ఇంటికి వెళ్లారట .. ఆ సమయంలో అల్లు రామలింగయ్య బార్య‌ వచ్చి మీకు ఎవరు కావాలని చిరంజీవిని అడిగారట .. తాను సత్యనారాయణ కోసం వచ్చానని చెప్పగా పైన ఉంటారు అని చెప్పి పంపించారట .. ఆ తర్వాత ఆ వచ్చిన వ్యక్తి చిరంజీవి కదా కుర్రాడు బాగున్నాడు ఇటీవల సినిమాల్లో కనిపిస్తున్నాడు అని అల్లు రామలింగయ్య కు చెప్పిందట .. అంతేకాదు మన కూతురు సురేఖకు ఆ కుర్రోడు మంచి జోడి అని అనిపిస్తుందని కూడా అల్లు రామలింగయ్య కి చెప్పగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అల్లుళ్ళుగా వద్దు అని మొహం మీద అన్నారట ..


ఇక ఆ తర్వాత ఓ 20 రోజులు పాటు చిరంజీవితోనే అల్లు రామలింగయ్య సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ..ఆ తర్వాత చిరంజీవి గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేయించిన అల్లు రామలింగయ్య చిరంజీవి అలవాట్లు అన్నీ తెలుసుకుని సురేఖకు మంచి జోడి అనుకున్నారట .. ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఆలీతో జాలీగా అనే ప్రోగ్రాంలో బయట పెట్టారు .. అలా ఓరకంగా చిరంజీవి సురేఖ పెళ్లికి సత్యనారాయణ అనే వ్యక్తి కారణమయ్యారు .. ఈ సత్యనారాయణ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారు అల్లూ ఫ్యామిలీతో దూర‌పు బంధుత్వం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: