నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు.. అయితే ఇటీవలే హీరో రామ్ చరణ్ కూడా ఇందులో పాల్గొన్నప్పటికీ రెండు ఎపిసోడ్లుగా చిత్రీకరించారట. అయితే ఇప్పుడు తాజాగా రెండవ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమోని కూడా ఆహా టీమ్ విడుదల చేసింది. మొదటి పార్ట్ గత వారం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా రామ్ చరణ్ ,బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 ప్రోమో రిలీజ్ చేశారు.



ఈ ప్రోమో సైతం అందర్నీ అద్వంతం సరదాగా ఆకట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. మొదటి ఎపిసోడ్ కి కంటిన్యూగా ఈ ఎపిసోడ్ ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ ఎంట్రీ గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడారు. అలాగే ఉపాసనతో లవ్ స్టోరీ విషయాన్నీ కూడా రామ్ చరణ్ చెప్పినట్టుగా కనిపిస్తోంది.. వీటితో పాటు చరణ్ అక్క సుస్మిత, చెల్లి శ్రీజ కూడా మాట్లాడిన వీడియోని బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్లే చేయడం జరిగింది. అలాగే ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడినట్టుగా కనిపిస్తోంది.


రామ్ చరణ్ తో పాటు రామ్ చరణ్ స్నేహితులు అయిన శర్వానంద్, ప్రముఖ నిర్మాత విక్రమ్ కూడా రావడంతో ఎన్నో విషయాలను కూడా పంచుకున్నట్టు ఈ ప్రోమోలో కనిపిస్తోంది. అలాగే శర్వానందుతో బాలయ్య చేయించిన సందడి కూడా ఈ ప్రోమో కి హైలైట్ గా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని కూడా రామ్ చరణ్ అనుసరించిన విధానాన్ని కూడా ప్రోమోలో చూపించారు. పార్ట్ 2 జనవరి 17న ఆహాలో స్ట్రిమ్మింగ్ కాబోతున్నదట. గేమ్ ఛేంజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా రావడంతో ఎమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు. మొదటి రోజు 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: