
ఎన్టీఆర్ తన కెరీర్ మొదట్లో తమిళ్ సినిమాల్లోనూ నటించే ఆకట్టుకున్నారు. తర్వాత కన్నడ దిగ్గజ హీరో రాజ్ కుమార్ కోరిక మేరకు పలు కన్నడ సినిమాల్లోనూ కనిపించాడు. తెలుగులోనే కాకుండా.. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అన్ని ప్రాంతాల భాషల్లో ఎన్టీఆర్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఒక విధంగా చెప్పాలంటే.. ఎన్టీఆర్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పౌరాణిక సినిమాలన్నీ తమిళ్ కర్నాటక భాషల్లోనే ఎక్కువగా ఆడేవి. అదే టైంలో బాలీవుడ్లో హీరోగా ఎదుగుతున్న అమితాబచ్చన్ సినిమా ఈవెంట్లకు.. ఎప్పుడు ఎన్టీఆర్ కూడా వెళ్లేవారట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌తో బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేయించాలని అమితాజ్ భావించే వారట. ఈ క్రమంలోనే తనతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలని అమితాబ్ ఆయనను కోరారట. అయితే ఆ అవకాశాన్ని మాత్రం అన్నగారు తిరస్కరించారు.
పట్టుబట్టి ఎన్నిసార్లు అమితాబ్ ఇదే ప్రశ్న అడగడంతో ఎలాగోలా ఎన్టీఆర్ తో ఒక్క సినిమా మాత్రమే బాలీవుడ్ లో చేయించడానికి ఒప్పించారు. అమితాబచ్చన్ దానికి ఒప్పుకొని సినిమా చేస్తున్న క్రమంలో బాలీవుడ్ లో నిర్మాత హఠాత్ మరణంతో.. ఆ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోయిందట. తర్వాత ఎన్టీఆర్ మరోసారి బాలీవుడ్ పై కన్నెత్తి చూసిందే లేదు.. తనకు అసలు బాలీవుడ్ లో నటించాలని ఆలోచన పూర్తిగా మానేశారట. ఇక అన్నగారికి ప్రాంతీయ భాష పై మక్కువ ఎక్కువ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అంటే ఆయనకు మరింత ఇష్టం. ఈ క్రమంలోనే తెలుగు సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ.. ఇక్కడి జనాన్ని మెప్పించారు. అంతే కాదు తెలుగులోనే ఎన్నో విభిన్నమైన సినిమాలు తీసేందుకు కూడా అన్నగారు ముందుండేవారు. అలా ఆయన తెలుగు పై ఉన్న మక్కువతో బాలీవుడ్ నుంచి ఎన్ని అవకాశాలు వచ్చినా.. వాటిని రిజెక్ట్ చేస్తూ కేవలం తనకు ఎంతో ఇష్టమైన తెలుగు సినిమాలతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఇక ఆయన రాజకీయాల పరంగా ఎలాంటి సంచలనాలు సృష్టించారు తెలిసిందే. ఇప్పటికి ఆయనను దేవుడిలా ఎంతో మంది పూజిస్తారు.