చాలావరకు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోయిన్లు క్రికెటర్లతో ప్రేమలో పడడం మనం చూస్తూనే ఉంటాం.. ఆ విధంగా విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నారు. అలాంటి ఈ తరుణంలో తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యాతో లవ్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరలవుతోంది. అంతే కాకుండా వీరిద్దరూ కలిసి వేకేషన్స్ కి వెళ్ళిన వీడియో కూడా వైరల్ అవ్వడంతో ఇది నిజంగానే అని చాలామంది నమ్ముతున్నారు. మరి ఇందులో ఏముంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. అయితే జాన్వి కపూర్ తో హార్థిక్ పాండ్యా లవ్ లో ఉన్నారని, వీరిద్దరూ కలిసి ఈ మధ్యకాలంలోనే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులకు వెళ్లారని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరలవుతున్నాయి. 

ముఖ్యంగా ఇందులో జాన్వి పాండ్యా సముద్రతీరంలో విహరిస్తూ సన్నిహితంగా కనిపించడంతో  చాలామందిని నేటిజన్స్ ఇది నిజమే అని నమ్ముతున్నారు. అయితే దీనిపై ఒక నేషనల్ మీడియా అసలు నిజమేనా కాదా అని రీ చెక్ చేసింది. దీంతో వీరు మాల్దీవులకు వెళ్లలేదని తేలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారని, ఇద్దరు కలిసి వెళ్లింది అంతా అబద్ధమని కొట్టి పడేసింది.

దీంతో ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్టు అయింది. ఇక జాన్వి కపూర్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న విషయం అందరికీ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఆర్సి 16లో హీరోయిన్ గా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జాన్వి కపూర్ పాండ్యా మధ్య ఉన్నటువంటి లవ్ స్టోరీ అనేది ఫేక్ అని తేలిపోయిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: