నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పౌరాణిక, సాంఘిక, జానపద అనే భేదాలు లేకుండా అప్పట్లోనే ఎన్నో జానర్‌లలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అన్నగారు.. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తిరుగలేని సంచలనాలను సృష్టించారు. లక్షలాదిమంది ప్రశంసలు అందుకున్నారు. కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ తన సినిమాలకు మాత్రమే కాదు.. తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది నటులను ప్రోత్సహించడంలో ముందుండేవారు. అలా ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని కూడా ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేసేవారట. ఇక అప్పట్లో ఎన్టీఆర్, విజయశాంతి కలిసి ఆమె నటించిన ప్రతిఘటన సినిమాను చూశారట.


సినిమా అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టమని.. ఎన్నోసార్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తన జీవితంలో రెండుసార్లు చూసిన ఏకైక సినిమా కూడా అదేనట. దీన్ని బట్టి మనం ఆయనకు ప్రతిఘటన సినిమా ఆయనకు ఎంతలా నచ్చేసిందో అర్థమవుతుంది. ఇక ఎన్టీఆర్ విజయశాంతితో కలిసి.. సత్యం శివం సుందరం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలుగా విజయశాంతి నటించిన ఆకట్టుకుంది. అప్పటినుంచి ఎన్టీఆర్, విజయశాంతిల మధ్య అనుబంధం దృఢ పడిందని.. ఆమె ఇంటి నుంచి ఎన్టీఆర్‌కు లంచ్ బాక్స్ కూడా పంపించేదని.. దానిని ఆయన ఎంత ఇష్టంగా తినే వారిని సమాచారం. ఇక విజయశాంతి కూడా ఆయనకు ఎక్కడ కనిపించిన ఆమెకు ఎంత గొప్ప ఆదిత్యం ఇచ్చేవాడట.


ప్రతిఘటన సినిమా కుల వివక్ష అన్నగారిన‌వర్గాల దుస్థితి లాంటి సామాజిక సమస్యలపై రూపొందించారు. ఆడియన్స్‌కు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. అలాగే రాజకీయ భావాజాలానికి కూడా ఈ సినిమా చాలా దగ్గరగా ఉంటుంది. న్యాయం, సమానత్వం కోసం పోరాడే ఓ మహిళగా విజయశాంతి ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమాలో సందేశం ఎన్టీఆర్కు బాగా నచ్చేసిందట. అందుకే ఆయన ఆ సినిమాను రెండుసార్లు ఎంతో ఇష్టంగా చూశారట. ఇక ఈ సినిమా 1985లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ రామోజీరావు తర్కెక్కించారు. ఇక అన్నగారు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన క్రమంలో ఈ సినిమా రిలీజ్ అయింది. అప్పట్లో సినిమా సూపర్ డూపర్ హిట్. తన అద్భుత న‌ట‌న‌కు విజయశాంతి బెస్ట్ యాక్టర్స్ గా నంది అవార్డును కూడా దక్కించుకుంది. ఈ అవార్డు విజయశాంతి స్వయంగా ఎన్టీఆర్ గారి చేతుల మీద నుంచి అందుకోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: