మెగాస్టార్ ఫ్యామిలీలో ఈసారి సంక్రాంతి సంబరాలు లేనట్లు తెలుస్తోంది. ఏ పండగ వచ్చిన మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక్క గొప్ప వేడుకల జరుపుకునేది. అందులోనూ సంక్రాంతి వచ్చిందంటే చాలు మెగా ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి. కానీ ఈ సారి మాత్రం మెగా ఫ్యామిలీలో ఇంతవరకు పండుగ సంబరాలు కనిపించట్లేదు.
అయితే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి సంబరాలకు మెగాస్టార్ చిరంజీవి వెళ్తున్నారు. ఈ కార్యక్రమానికి ట్రెడిషనల్ సంక్రాంతి పొంగల్ సెలెబ్రేషన్స్ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ సంబరాల్లో ప్రధానమంత్రి మోదీ కూడా పాల్గొనడం విశేషమనే చెప్పాలి. అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మెగా ఫ్యామిలీ తో పాటు అల్లు ఫ్యామిలీ కూడా సందడి చేస్తుంది. ఈ రెండు ఫ్యామిలీలు కలిసి బెంగళూరులోని ఫామ్ హౌస్ లో పండుగ జరుపుకుంటారు.
ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా నడుస్తుంది. ఇలాంటి టైంలో ఆ రెండు కుటుంబాలు సంక్రాంతి సెలెబ్రేషన్స్ ఎలా జరుపుకుంటాయో అని అంతా ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానం మేరకు స్టార్ హీరో చిరంజీవి ఢిల్లికి పయనమయ్యారు. ఇక ఈ సారి చిరంజీవి లేకపోయినా రామ్ చరణ్ లేదా ఉపాసన ఎవరో ఒకరు ఫ్యామిలీ మొత్తాన్ని కో ఆర్టినేట్ చేసి పండుగను జరిపిస్తారా.. లేక అసలు ఈ సారి పండుగానే జరుపుకోరా అనేది చూడాలి మరి.

ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు బెంగళూరుకు వెళ్లినట్టుగా అయితే ఎక్కడా ఫోటోలు, వీడియోలు కనిపించలేదు. ఇక రేపు ఈ ఫ్యామిలీల నుంచి ఎవరైనా పోస్టులు పెడతారా? లేదా? అన్నది చూడాలి. ఇక  ఇటీవల మెగా హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: