బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. సంక్రాంతి పండుగ అంటే తప్పకుండా బాలయ్య సినిమా ఉండాల్సింది. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు ఏదో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాడు. ఈ సంవత్సరం కూడా బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. దీంతో బాలయ్య బాబు అభిమానులు ఫుల్ ఖుషితో సంబరాలు జరుపుకుంటున్నారు.

సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కూడా చిత్ర బృందం నిర్వహించారు. ఇందులో బాలయ్య సంతోషంలో ఊర్వశితో కలిసి దబిడి దిబిడి పాటకు స్టెప్పులు వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఊర్వశి షేర్ చేసింది. కాగా డాకు మహారాజ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. డాకు మహారాజ్ సినిమాకు ఓపెనింగ్ కూడా బాగానే జరిగాయి.


సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, బాబి డియోల్, ఊర్వశి రౌతేలా, హిమజ, హర్షవర్ధన్, సచిన్ కేడేకర్ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు.


సినిమా నుంచి ఇదివరకే విడుదలైన టైలర్స్, టీజర్స్ ప్రేక్షకులను భారీగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది. అయితే ఈ సినిమా సరియు, విలన్ మధ్య ఓ ఆసుపత్రి సీన్ ఉంటుంది. అందులో డబుల్ మీనింగ్ వచ్చేలా కొన్ని బూతులు ఉన్నాయి. ఆ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీంతో కొంత మంది నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: